HomecinemaRajamouli: ఐదు ల‌క్ష‌ల కోసం రాజ‌మౌళి న‌న్ను అవ‌మానించారు అంటూ సీనియ‌ర్ న‌టి కామెంట్

Rajamouli: ఐదు ల‌క్ష‌ల కోసం రాజ‌మౌళి న‌న్ను అవ‌మానించారు అంటూ సీనియ‌ర్ న‌టి కామెంట్

Telugu Flash News

Rajamouli: తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా పాకేలా చేసిన రాజ‌మౌళి ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి చేత ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. ఈ స‌మ‌యంలో ఓ సీనియ‌ర్ న‌టి రాజ‌మౌళి త‌న‌ను అవ‌మానించార‌ని పేర్కొంది.

తెలుగు సినిమా రెండో తరం హీరోయిన్స్ లో కాంచన ఒకరు కాగా, ఆమె తాజాగా మాట్లాడుతూ.. బాహుబలి చిత్రంలో ఒక పాత్ర కోసం నన్ను సంప్రదించారు రాజ‌మౌళి. రెండు రోజులు షూట్ ఉంటుందని చెప్ప‌డంతో, నేను రూ. 5 లక్షలు డిమాండ్ చేశాను.

అందుకు రాజమౌళి అది చాలా ఎక్కువ. మీ పాత్రకు అంత ఇవ్వడం కుదరదని చెప్పారు. రూ. 5 లక్షలు రాజమౌళికి పెద్ద అమౌంటా.. మాకు ఇస్తే సేవ చేసుకునే వాళ్లం కాదా, ఐదు లక్షల కోసం నన్ను ఆయన పక్కన పెట్టి అవమానించారు అని కాంచ‌న చెప్పుకొచ్చింది.

హైదరాబాద్ లో సెటిలైన కాంచన చాలా గ్యాప్ తర్వాత అర్జున్ రెడ్డి మూవీలో నటించి మెప్పించింది.. అర్జున్ రెడ్డిలో హీరో విజయ్ దేవరకొండ నానమ్మ పాత్ర లో క‌నిపించారు కాంచ‌న. మంచి పాత్ర‌లు ఇస్తే చేయ‌డానికి సిద్ధ‌మంటున్నారు ఆమె.

also read :

Evergreen : ఉద్యోగులకు బంపరాఫర్‌.. ఆ కంపెనీలో ఏకంగా ఐదేళ్ల బోనస్‌!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News