Jawan 4 days collections : ఈ సంవత్సరంలో, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పఠాన్ మరియు జవాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. కొంతకాలం క్రితం బాలీవుడ్‌లో సరైన పెద్ద హిట్ సినిమాలు లేవు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ సతమతమవుతున్న వేళ సౌత్ ఇండస్ట్రీ పాన్ ఇండియా సక్సెస్ లను అందుకుంటూ బాలీవుడ్ లో వందల కోట్లు వసూలు చేసింది.
సరిగ్గా అలాంటి సమయంలో ఐదేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ తో వచ్చిన షారుక్ బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఆ సినిమాతో ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించి హిందీ పరిశ్రమకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు.
దీంతో అతడు బాలీవుడ్ బాద్ షా అని మరోసారి రుజువైంది. ఇప్పుడు ఏడు నెలల విరామం తర్వాత సెప్టెంబర్ 7న జవాన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. జవాన్ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్లు వసూలు చేసినట్లు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకే ఏడాది రెండు సినిమాలు రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించాడు షారుక్.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఒక్క ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా జవాన్ సినిమా 28 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. భారతీయ సినిమా చరిత్రలో ఎవరూ సాధించలేని రికార్డు ఇది అని పలువురు అంటున్నారు. దీంతో లాంగ్ రన్ లో జవాన్ రూ.1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షారుఖ్ చేతిలో మరో సినిమా మాత్రమే మిగిలి ఉంది. అది ‘డంకీ’. మరి ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయితే షారుక్ హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడు.
Shah Rukh Khan Jawan telugu movie review :జవాన్ తెలుగు మూవీ రివ్యూ