jailer telugu movie review
జైలర్ మూవీ కథ ఏంటంటే ?
టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) స్ట్రిక్ట్ జైలర్. తన జైలులో ఉన్న ఖైదీలను క్రమశిక్షణలో ఉంచి వారిని తన ఆధీనంలో ఉంచుకోగల సామర్థ్యం ఆయనకు ఉంది. ఏ ఖైదీ కూడా తాను నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించే సాహసం చేయడు. అయితే వృత్తిపరంగా ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాడో, కుటుంబసభ్యుడిగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ ఒక రోజు ముత్తువేల్ పాండియన్ గ్యాంగ్‌స్టర్‌ని తన జైలులో నుండి తప్పించుకోబోతుంటే ఆపి అతన్ని తిరిగి జైలుకు పంపిస్తాడు. అప్పుడు గ్యాంగ్‌స్టర్ అనుచరులు ముత్తువేల్ కుటుంబంపై దాడి చేసి అతని కొడుకును దారుణంగా చంపుతారు. తన కొడుకును చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ముత్తువేల్ క్రూరుడిగా మారుతాడు. ఒక వైపు జైలర్ వృత్తి , మరోవైపు పగ .. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
జైలర్ మూవీ ఎలా ఉందంటే ?
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. 40 నిమిషాల పాటు సినిమా స్లోగా నడుస్తుండటంతో రజనీకాంత్ సినిమా మళ్లీ ఫ్లాప్ అవుతుందా అని అభిమానులు భయపడ్డారు. అయితే అప్పటి నుంచి అసలు సినిమా మొదలవుతుంది. నెల్సన్ మార్క్ కామెడీ కొన్ని చోట్ల పేలింది. ఫస్ట్ హాఫ్ లో రెండు మూడు ఎక్సయిటింగ్ సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకుల మైండ్‌ని ఉర్రూతలూగించింది. ఓవరాల్‌గా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఓ రేంజ్ ఇంటర్వెల్‌తో డీసెంట్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన మార్క్ మ్యానరిజం, హీరోయిజం అభిమానులకు కన్నుల పండువగా నిలుస్తాయని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడా టీజర్‌లో, ట్రైలర్‌లో చూపించిన ప్రధాన పాత్రలు మనకు కనిపించవు. తమన్నా, మోహన్‌లాల్, సునీల్ తదితరులు ఫస్ట్ హాఫ్‌లో కనిపించరు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఫస్ట్ హాఫ్ లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ద్వితీయార్థం ప్రారంభం నుంచే రజనీకాంత్ విశ్వరూపం మొదలవుతుంది. మొదటి 20 నిమిషాల్లో జైలు సన్నివేశాలు, రజనీకాంత్ వ్యవహారశైలి, డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఇన్ని రోజులు సూపర్ స్టార్ నుంచి ఇదే కోరుకున్నామని అందరూ అనుకుంటున్నారు. దర్శకుడు నెల్సన్ ఆ రేంజ్ లో సీన్స్ రాసుకున్నాడు. ఈ సినిమా చూసి చాలా కాలం తర్వాత రజనీకాంత్‌ని ఓ దర్శకుడు అద్భుతంగా వాడుకున్నాడని అందరూ భావిస్తున్నారు. మిగతా నటీనటులందరూ తమ పరిధి మేరకు నటించారు. అనిరుధ్ నేపథ్య సంగీతం, ఆయన పాటలు ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచాయి.
జైలర్ మూవీ రేటింగ్ : 3/5 .
also read :
Bhola Shankar : కోర్టు కేసులో భోళా శంకర్! చిరు షాక్!
today rasi phalalu in telugu : 10/08/2023 ఈ రోజు రాశి ఫలాలు