జబర్దస్త్ షో (Jabardasth) లో అనేక మంది యువ కళాకారులు కమెడియన్లుగా రాణిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినిమాల్లోనూ చాన్స్‌లు కొట్టేశారు. ఇలా జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్ గణపతి.. ప్రేక్షకులను తన హావభావాలతో మెప్పించాడు. ప్రస్తుతం జబర్దస్త్ మానేసిన గణపతి.. విద్యార్థులకు పాఠాలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు.
గణపతికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలనే చిరకాల వాంఛ మాత్రం మిగిలిపోయింది. అద ఇప్పుడు సాకారమైంది. హైపర్ ఆది టీమ్‌లో పని చేసిన గణపతి.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్కిట్లలో కూడా టీచర్‌గా, స్టూడెంట్‌గా మెప్పించారు. గణపతికి ప్రభుత్వ టీచర్‌గా పని చేయాలనే కోరిక ఉండేది. అందుకోసం పాతికేళ్ల నుంచి కష్టపడుతున్నారు.
ఇటీవల ఏపీ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఇందులో గణపతికి టీచర్ గా ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో వెంటనే ఉద్యోగానికి గణపతి ఓకే చెప్పేశారట. తన సొంత ఊరు శ్రీకాకుళంలో టీచర్‌గా సెటిల్ అవ్వనున్నారు గణపతి.
ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా గణపతి అందరికీ తెలియజేశారు. తన పాతికేళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. తన కల నెరవేర్చినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యావాదాలంటూ గణపతి పేర్కొన్నారు.
also read :
Horoscope (18-04-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?