HomehealthDiabetes : మధుమేహం ఉన్నవారికి పప్పులు మంచివేనా? ఏ పప్పు తీసుకోవడం మంచిది?

Diabetes : మధుమేహం ఉన్నవారికి పప్పులు మంచివేనా? ఏ పప్పు తీసుకోవడం మంచిది?

Telugu Flash News

పప్పులు లేదా కాయధాన్యాలు పోషక విలువలకు ప్రసిద్ధి చెందినవి-అందరికీ ముఖ్యంగా మధుమేహం (Diabetes) వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వైద్యులు ఎక్కువగా ఆహారంలో వీటిని తీసుకోమంటారు. కానీ అవి ఎలా సహాయపడతాయి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వైద్యులు ఏం చెప్తున్నారు?

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొన్ని పప్పులు ఎలా మంచివి మరియు ఎందుకు అనే దాని గురించి నిపుణులు ఏం అంటున్నారు. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ యొక్క IDF డయాబెటిస్ అట్లాస్ టెన్త్ ఎడిషన్ 2021 ప్రకారం, 2030 నాటికి 643 మిలియన్లకు మరియు 2045 నాటికి 783 మిలియన్లకు డయాబెటిస్ పెరుగుతుందని అంచనా వేశారు.

డయాబెటిస్ (Diabetes) పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణాలు

ఆహారపు అలవాట్లు అలాగే ఊబకాయం కూడా ప్రధాన కారణాలు అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జనాభాలో అధిక భాగం శాఖాహారులు కాబట్టి, ముఖ్యంగా ప్రపంచ మధుమేహ రాజధానిగా చెప్పబడుతున్న భారతదేశం వంటి దేశాల్లో, మధుమేహం ఆహార ప్రణాళికలో పప్పుధాన్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

పప్పులలో – అధిక ఫైబర్, ప్రోటీన్ మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా నెమ్మదిగా జీర్ణం అవుతాయని పరిశోధనలో తేలింది దీనివలన శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అలాగే, అవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉండడం వల్ల, అవి వినియోగించిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు.

ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ మరియు మెగ్నీషియం వంటి విటమిన్లు మరియు ఖనిజాల యొక్క అద్భుతమైన మూలాలు. ఫైటోకెమికల్స్ (సపోనిన్లు మరియు టానిన్లు) వంటివి పప్పుధాన్యాలలో కూడా ఉన్నాయి, ఇవి బలమైన యాంటీ-కార్సినోజెనిక్ మరియు యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలను చూపిస్తాయి. వీటి వినియోగం వల్ల లిపిడ్ ప్రొఫైల్ మరియు రక్తపోటును కూడా మెరుగుపడుతుందని పరిశోధన ద్వారా తేలింది.

మధుమేహం లేదా మరేదైనా దీర్ఘకాలిక వ్యాధితో జీవించడానికి ఒక వ్యక్తి ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.తక్కువ గ్లైసెమిక్ స్థాయి కలిగిన ఆహారాలు, కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు, ఎక్కువ డైటరీ ఫైబర్, ఖనిజాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న పోషకాహారం తీసుకోవడం ముఖ్యం.

-Advertisement-

కానీ ఏ పప్పు తీసుకోవడం మంచిది?

మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, మీరు మీ పప్పును తెలివిగా ఎంచుకోవాలి మసూర్ పప్పు (ఎర్ర పప్పు) ను ఎంచుకోవడం మంచిది, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మినప పప్పు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అలాగే, పెసర పప్పులో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు కీలకమైన పోషకాలు, ఫైబర్ మరియు ప్రోటీన్ ఉంటాయి.

డయాబెటిక్స్ వారి డైట్ ప్లాన్‌లో కచ్చితంగా ఉండాల్సినవి

చిక్‌పీస్ , రాజ్మా ,సెనగలు ,పెసర పప్పు (పొట్టుతో ఉన్నది మరియు విడిగా ఉన్నది) , మినపపప్పు

అయితే వీటిని పరిమితంగా వైద్యుల సలహా లేదా నిపుణుల సలహా మేరకు సరైన మోతాదులో రోజూ ఈ ఆహారం తీసుకోవడం వలన మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

more news :

Diabetes : మధుమేహ రోగులు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News