HometelanganaCrime News : భర్త వేధింపులు తట్టుకోలేక భార్య సూసైడ్ 😭

Crime News : భర్త వేధింపులు తట్టుకోలేక భార్య సూసైడ్ 😭

Telugu Flash News

Crime News : వరంగల్ జిల్లాలో భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై షేక్ జాన్పాషా తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండ మండలం మూడుతండాల పంచాయతీ మంగళితండా చెందిన భూక్య వెంకన్న జ్యోతి దంపతుల కుమార్తె రాజేశ్వరి(20)ని ములుగు జిల్లా దేవగిరిపట్నంకు చెందిన వకుండోతు రమేష్‌కు ఇచ్చి ఏడాది కిందటే వివాహం చేశారు.

అప్పట్లో రూ.10 లక్షల నగదు, 5 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. అయితే కొన్నాళ్లుగా అదనపు కట్నం ఇవ్వాలని రమేష్ భార్యను వేధిస్తున్నాడు. ఈ విషయమై భార్యాభర్తలు పలుమార్లు గొడవ పడ్డారు. మూడు నెలల తర్వాత రమేష్.. రాజేశ్వరిని తీవ్రంగా వేధింపులకు గురిచేసి కొట్టడంతో తట్టుకోలేక తన ఇంటికి వెళ్లిపోయింది.

అయితే రమేష్‌ తరచూ తన భార్యకు ఫోన్ చేసి వేధిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్వరి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

also read :

Weather Report : విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, వచ్చే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News