Telugu Flash News

pimples: ముఖంపై మొటిమలా? వంటింట్లో లభించే వస్తువులతో ఇలా పోగొట్టుకోండి!

pimples

how to remove pimples naturally and permanently

1. ముఖంపై మొటిమలు (pimples) ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది. బయట తిరగాలంటే అదో రకమైన ఫీలింగ్‌ వచ్చేస్తుంది.

2. యుక్త వయసు వచ్చిన మగ పిల్లలు, ఆడ పిల్లల్లో సాధారణంగా మొటిమలు వస్తుంటాయి.

3. శరీరంలో హార్మోన్లు విడుదల కావడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో సబ్బులు వాడినా, కలుషిత నీటితో మొహం కడుక్కున్నా మొటిమలు వస్తుంటాయి.

4. మొటిమలు అరికట్టేందుకు అనేక రకాల మార్గాలు ఉన్నాయి. వంటింట్లో లభించే వస్తువులతో మొటిమల్ని ఈజీగా పోగొట్టవచ్చు.

5. ఇంట్లో లభించే తేనెలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. మొటిమలు పోగొట్టడానికి తేనె ఉపయోగపడుతుంది.

6. మొటిమలను అడ్డుకొనేందుకు యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ ఎంతగానో తోడ్పడుతుంది. చర్మ సమస్యలనూ దూరం చేస్తుంది.

7. చర్మంపై మృత కణాలను తొలగించడానికి విటమిన్‌ సీ కలిగిన నిమ్మకాయ వాడొచ్చు.

8. రోజూ గ్రీన్‌ టీ తీసుకుంటే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలను నివారిస్తాయి.

9. వేపాకు తీసుకొని మొటిమలపై అప్లై చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. అలోవెరాతోనూ మొటిమలు వేగంగా తగ్గుతాయి.

10. పసుపును ఉపయోగించి కూడా మొటిమల్ని నయం చేసుకోవచ్చు. చర్మ సౌందర్యానికి పసుపును మించినది లేదు.

Also Read:

Viral Video Today : ట్రాఫిక్‌ కష్టాలు.. మెట్రోలో పెళ్లి మండపానికి వెళ్లిన వధువు..!

క్యారెట్‌, బీట్‌రూట్‌, టమాటా కాంబో జ్యూస్‌.. పరగడుపున తాగితే లాభాలివే!

G.O. No.1 News : జీవో నంబర్‌ 1 పై పట్టు వదలని వైసీపీ సర్కార్‌.. సుప్రీంకోర్టులో నేడు విచారణ

Exit mobile version