Homehealthhow to remove dandruff permanently : చుండ్రు సమస్యను దూరం చేసే 9 చిట్కాలు

how to remove dandruff permanently : చుండ్రు సమస్యను దూరం చేసే 9 చిట్కాలు

Telugu Flash News

how to remove dandruff permanently : జుట్టు రాలడంతో పాటు చుండ్రు కూడా ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. చుండ్రు బట్టలపై పడి అసహ్యంగా కనిపిస్తుంది, ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చుండ్రు సమస్యతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే అనేక షాంపూలను వాడుతున్నా ఫలితం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో ఆయిల్ మరియు ఫంగస్ అధికంగా ఉండటం వల్ల డెడ్ స్కిన్ ఏర్పడి చుండ్రు వస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. కోల్ టార్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ మరియు జింక్ పైరెథ్రోన్ ఉన్న షాంపూలు చుండ్రును తగ్గిస్తాయి. 5-10 నిమిషాల పాటు తలకు పట్టించి తలస్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది.

  1. జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం తీసుకోవాలి. విటమిన్ బి మరియు జింక్ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి.
  2. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఆచరించాలి.
  3. హెయిర్ ఆయిల్స్, స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్న షాంపూలను ఇష్టానుసారంగా వాడకూడదు.
  4. జుట్టును నీళ్లతో కడగాలి.. డ్రై షాంపూలకు దూరంగా ఉండాలి. యాంటీ డాండ్రఫ్ షాంపూలను ఉపయోగించండి.
  5. ప్రతిరోజూ పడుకునే ముందు కొబ్బరి నూనెను జుట్టుకు పట్టించి, ఉదయాన్నే షాంపూతో జుట్టును కడుక్కోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
  6. ఒక గిన్నెలో కెమికల్ ఫ్రీ షాంపూతో నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇలా 2 వారాల పాటు చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు.
  7. పుదీనా రసాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.
  8. వేప ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి పావుగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి తల శుభ్రంగా ఉంటుంది.
  9. పుల్లటి పెరుగును ఉదయాన్నే రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వారానికి 2 సార్లు చేస్తే చుండ్రు సమస్యలు తొలగిపోతాయి.

read more news :

dandruff : తలలో చుండ్రు పోవాలంటే ఏం చేయాలి ? పరిష్కార మార్గాలు ఇవే..

dandruff : చుండ్రు పోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి?

Dandruff: చుండ్రు తగ్గడానికి చిట్కాలు.. శాశ్వతంగా చుండ్రుకి గుడ్ బై చెప్పండి..

-Advertisement-

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News