చికెన్ & వంకాయ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు : చికెన్ 1 కిలో వంకాయలు 1 1/2 కిలో కొబ్బరిపాలు 1 కప్పు పంచదార 2 టీ స్పూన్లు ఫిష్ సాస్ 4 టీ స్పూన్లు పుదీనా కొద్దిగా నూనె తగినంత ఉల్లికాడలు 6 ఉప్పు తగినంత
చికెన్ & వంకాయ కర్రీ తయారీ విధానం : చికెన్ ను వంకాయలను మీడియమ్ సైజులో ముక్కలు గా తరుక్కోవాలి. నూనె వేడి చేసి ఈ వంకాయ ముక్కలను వేసుకోవాలి. ముక్క కాస్త మెత్తబడ్డాక కొబ్బరిపాలు అందులో పోయాలి. సన్నని మంట మీద మరగనివ్వాలి. పాలు మరిగాక పంచదార, పుదీనా, ఫిష్ సాస్ వేసి మగ్గ నివ్వాలి. తర్వాత చికెన్ ముక్కలు వేసి అవి మెత్తబడి కాస్తరంగు వచ్చే దాకా ఉడికించాలి. ఉల్లికాడలను ఈలోపు తరిగి ఉంచుకోవాలి. పదార్థాలన్నీ ఉడికాయనుకున్నప్పుడు ఈ ఉల్లికాడ ముక్కలను ఉప్పు వేసి సన్నని మంట మీద ఈ మిశ్రమాన్ని దగ్గరగా వచ్చే వరకూ ఉడికించి దించుకోవాలి.