eye care tips : మీ అందమైన కళ్ళను కాపాడుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- సూర్యరశ్మి తగిలేచోట నిలబడి తలను అటునుంచి ఇటు, ఇటునుంచి అటు తిప్పాలి. అలా చేయటం వలన ముఖంలోని అన్ని భాగాలకు ఎండ తగులుతుంది. ఇలా చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఇలా పదినిముషాలు చేయాలి. ఇలా చేస్తే కళ్ళకు చాలా మంచిది.
- చల్లని నీటిని గిన్నెలోకి తీసుకొని దోసిటిలో నీళ్ళను నింపి కళ్ళకు 2 అంగుళాల దూరం నుంచి కళ్ళమీద చల్లు కోవాలి. ఇలా ఇరవైసార్లు చెయ్యాలి. తరువాత టవల్ తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. చల్లటి నీళ్ల బదులు నీళ్ళను వేడిచేసి చల్లార్చి ఈ పద్ధతిలో వాడితే ఇంకా మంచిది. ఇలా చెయ్యటం వలన కళ్ళ అలసట తగ్గుతుంది. ఫ్రెష్సెస్ వస్తుంది.
- చదివేటప్పుడు ప్రతి 10 సెకన్లకు ఒకసారి కానీ, 2 సార్లు కానీ కళ్ళు ఆర్పుతూ ఉండాలి. కళ్ళ జబ్బులు ఉన్నవాళ్ళకి, దృష్టిలోపం ఉన్నవాళ్ళకి ఇలా చెయ్యటం వలన చూపు పెరిగే అవకాశం కూడా ఎక్కువే.
- పాలకూర ఆకులు నూరి కళ్ళముందు పెట్టుకుంటే మంటలు తగ్గి చల్లగా ఉంటుంది.
- చల్లటి పాలలో దూది ముంచి పాలు పిండేసి తడి దూదిని కళ్ళపై 20 నిముషాలు ఉంచుకుంటే అలసట తగ్గుతుంది.
- కళ్ళు మూసుకొని వాటి మీద గుండ్రటి దోసచక్రాల్ని కానీ, నందివర్ధన పువ్వుల్ని కానీ, చంద్రకాంత ఆకుల్ని గానీ కాసేపు ఉంచుకుంటే కళ్ళు మంటలు, నొప్పి ఉన్నా ఉపశమనంగా ఉంటుంది.
మరిన్ని అందమైన వార్తలు చదవండి:
how to get soft feet : మీ పాదాలు మృదువుగా ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!
tips for healthy nails : మీ గోళ్లు ఆరోగ్యంగానే ఉన్నాయా..? గోళ్ళు శుభ్రంగా లేకపోతే ప్రమాదమే!
మీ చేతులు మృదువుగా, నాజూకుగా తయారవ్వాలంటే ఏం చేయాలి ?
-Advertisement-