ఇన్స్టాగ్రామ్ అత్యంత లోక ప్రియమైన, జనాదరణ కలిగిన సోషల్ మీడియా యాప్. ఇందులో ప్రతి నెలా దాదాపు ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది యూజర్స్ యాక్టివ్ గా ఉంటారు. వీరిలో రోజుకు దాదాపు 500 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుతుంటారు. 25-34 సంవత్సరాల మధ్య వయస్సు గల యూజర్స్ Instagram లో ఎక్కువ సమయం గడుపుతుంటారు.
ఇన్స్టాగ్రామ్ అనేది టైం పాస్, ఎంటర్టైన్మెంట్ హబ్ గానే కాకుండా ఆదాయం ఆర్జించి పెట్టే వనరుగా కూడా మారింది. ఎంతోమంది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఇలా ఆదాయాన్ని గడిస్తున్నారు. అయితే ఇందుకు ఉండాల్సిన అర్హతలు ..ఆకర్షణీయమైన కంటెంట్, పెద్దఎత్తున ఫాలోయర్స్. ఇవి ఉన్నవాళ్లు ఇన్స్టాగ్రామ్ క్రియేటర్లుగా మారి కాసుల వర్షం కురిపిస్తున్నారు.
క్రేజ్ పెరిగింది..
ఇన్స్టాగ్రామ్ క్రియేటర్లకు ఇటీవల క్రేజ్ పెరిగింది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కొత్త ట్రెండ్‌గా మారింది. ఎన్నో సంస్థలు, కంపెనీలు తమ ప్రోడక్ట్స్ ను జనానికి పరిచయం చేసేందుకు ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ల సహాయం తీసుకుంటున్నాయి.ఇన్స్టాగ్రామ్ క్రియేటర్లు కూడా తమకు స్పాన్సర్ చేసే వాళ్లకు ఉపయోగపడేలా క్రియేటివ్ వీడియోస్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇలా చేసినందుకుగానూ ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బు, ఉచిత ఉత్పత్తులు లేదా రెండింటినీ ఆఫర్ చేస్తుండటం విశేషం.
ఇన్ఫ్లుయెన్సర్ రకాన్ని బట్టి రేటు..
* ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక రకాల ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీటిలో నానో ఇన్ఫ్లుయెన్సర్లు, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు, మిడిల్-టైర్ ఇన్ఫ్లుయెన్సర్లు, టాప్-టైర్ ఇన్ఫ్లుయెన్సర్లు, మెగా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు.
* నానో ఇన్ఫ్లుయెన్సర్లు 2000-9,000 మంది అనుచరులను కలిగి ఉంటారు. వీరికి ఒక్కో స్పాన్సర్ పోస్ట్ కు రూ. 4000 నుండి రూ. 16,000 దాకా చెల్లిస్తున్నారు.
* మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లకు 10,000 – 50,000 మంది అనుచరులు ఉంటారు. వారు ఒక్కో పోస్టుకు రూ. 16,000 నుండి రూ. 30,000 దాకా ఇస్తున్నారు.
* 60,000 – 100,000 మంది అనుచరులు ఉన్నవాళ్ళు మిడిల్-టైర్ ఇన్ఫ్లుయెన్సర్లు. వీరికి ఒక పోస్ట్‌కు రూ.35,000 నుండి రూ. 60,000 దాకా ఇస్తారు.
* 100,000 – 500,000 మంది అనుచరులు ఉన్న వాళ్ళు టాప్-టైర్ ఇన్ఫ్లుయెన్సర్లు. వీరికి ఒక్కో పోస్టుకు రూ. 1 లక్ష దాకా ఇస్తున్నారు.
ఎంత మంది ఫాలోవర్లు కావాలి ?
ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బు సంపాదించడానికి ఎంత మంది ఫాలోవర్లు కావాలి ? మీ ఫాలోవర్ల సంఖ్యను బట్టి మీకు ఆదాయం వచ్చే అవకాశాలు మారుతాయి. ఉదాహరణకు మీరు ఒక ఫ్యాషన్ బ్లాగర్ అని అనుకుందాం. ఆ సెక్షన్ లో డబ్బు సంపాదించడానికి మీకు ఎక్కువ మంది అనుచరులు అవసరం పడతారు.
ఒకవేళ మీరు ఫుడ్ లేదా ఫిట్నెస్ బ్లాగర్ అయితే, తక్కువ ఫాలోవర్లతో కూడా కొంత డబ్బు సంపాదించడం త్వరగానే ప్రారంభించవచ్చు.ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బు సంపాదించడానికి ఉత్తమ మార్గం స్పాన్సర్షిప్. తమ ఉత్పత్తుల కోసం ప్రాయోజిత పోస్ట్‌లను సృష్టించడానికి బ్రాండ్లు లేదా మార్కెటింగ్ ఏజెన్సీలు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ను సంప్రదిస్తుంటాయి.
వ్యాపార ప్రచారానికి చక్కటి వేదిక
మీకు వ్యాపారం ఉంటే ఇన్స్టాగ్రామ్ వేదికగా సులువుగా ప్రచారం చేసుకోవచ్చు. మీ లక్ష్య ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి Instagram ఒక గొప్ప మార్గం . ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తో కాంటాక్ట్ అయి మీ ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేసుకోవచ్చు.
also read:
Bajra Khichdi : చలికాలంలో ఎంతో ఆరోగ్యవంతమైన సజ్జలతో కిచిడి తయారీ..టేస్ట్ చేసి చెప్పండి..