Wednesday, May 15, 2024
Homerecipesmango pulav : పచ్చి మామిడికాయ తో పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసా ?

mango pulav : పచ్చి మామిడికాయ తో పులావ్ ఎలా చేసుకోవాలో తెలుసా ?

Telugu Flash News

mango pulav

పచ్చి మామిడికాయ తో పులావ్ తయారీ కి కావల్సిన పదార్థాలు

రెండు కప్పులు బాస్మతి బియ్యం;
ఒకటి పచ్చిమామిడి ;
అర టీస్పూన్ జీలకర్ర ;
చిటికెడు దాల్చిన చెక్క;
నాలుగు యాలకులు;
నాలుగు లవంగాలు;
పావు టీస్పూన్ మిరియాలు;
రెండు టీస్పూన్లు నెయ్యి;
పసుపు అర టీస్పూన్;
నాలుగు పచ్చిమిర్చి;
చిన్నముక్క అల్లం;
తగినంత ఉప్పు;
కొద్దిగా కొత్తిమీర;

పచ్చి మామిడికాయ తో పులావ్ తయారీ విధానం

ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి రెండు గంటలు నానబెట్టాలి. మామిడికాయను సన్నగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. అన్నీ బాగా ఉడికిన తర్వాత అందులో మామిడికాయ తురుము వేసి వేయించాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.. అలాగే నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని కూడా వేసి కలపాలి. మూడు కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత కుక్కర్‌ మూతతీసి కొత్తిమీరతో అలంకరించాలి. పచ్చిమామిడి పులావ్ రెడీ.

also read :

sunflower seeds benefits : పొద్దు తిరుగుడు గింజలు.. అమేజింగ్ లాభాలు..

Mutton Canteen : నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 12 న తెలంగాణ మటన్‌ క్యాంటీన్‌ ప్రారంభం

-Advertisement-

mouni roy hot pictures, stills, photos 2023

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News