today horoscope in telugu : మార్చి 30, 2024 ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Aries | మేష రాశి ఫలాలు 30-03-2024
ఈ రాశి వారికి ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఖర్చులు అధికముగా ఉండును. కుటుంబానికి స్నేహితులకు ధనసహాయము, దానధర్మములు చేస్తారు.. నూతనంగా వస్తువులు కొనడానికి ధనాన్ని బాగా ఖర్చు చేస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన.
Taurus | వృషభ రాశి ఫలాలు 30-03-2024
ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలించును. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషపు పట్టుదలకు దూరంగా ఉండాలని సూచన. వృషభరాశివారికి సంబంధించిన స్త్రీలకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం పూజ చేయాల్సి ఉంటుంది.
Gemini | మిథున రాశి ఫలాలు 30-03-2024
ఈ రాశివారికి ఉద్యోగములో ఒత్తిళ్ళు తగ్గును. లాభములో రాహువు ప్రభావంచేత పనుల యందు లాభము చేకూరును. రాహువు అనుకూల ప్రభావంచేత సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమిస్తారు.. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Cancer | కర్కాటక రాశి ఫలాలు 30-03-2024
ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలయందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.
Leo | సింహ రాశి ఫలాలు 30-03-2024
ఈ రాశి వారికి కుటుంబము నందు చికాకులు, సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. కుటుంబ విషయాల యందు, ఆర్థిక వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి.
Virgo | కన్యా రాశి ఫలాలు 30-03-2024
ఈ రాశి వారు అనుకున్న ప్రతీ పనియందు విజయాన్ని సాధిస్తారు. శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు అనుకూల సమయము, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి.
Libra | తులా రాశి ఫలాలు 30-03-2024
ఈ రాశి వారికి శత్రు వర్గము వలన ఇబ్బందులు, కుటుంబము నందు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు కలుగుతాయి. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబము నందు సౌఖ్యము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 30-03-2024
ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ప్రయాణములు అనుకూలిస్తాయి.. శారీరక శ్రమ అధికముగా ఉండును. ముఖ్యమైన పనులు విజయవంతముగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఏర్పడతాయి.
Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 30-03-2024
ఈ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ధనలాభము, సౌఖ్యము కలుగుతాయి.
Capricorn | మకర రాశి ఫలాలు 30-03-2024
మకర రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు పెరుగును. గొడవలకు, వివాదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో, సోదరులతో భేదాభిప్రాయములు కలుగుతాయి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును.
Aquarius | కుంభ రాశి ఫలాలు 30-03-2024
ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు, వేదనలు, సమస్యలు అధికముగా ఉండును.తెలివి తేటలతో ఆర్ధిక సమస్యల నుండి ఒత్తిళ్ళనుండి బయటపడెదరు. చేసే పనులు అనుకూలించి సత్ఫలితాలు ఇస్తాయి.. అనేక సమస్యల నుండి బయట పడేటటువంటి ప్రయత్నములో విజయాన్ని సాధిస్తారు.
Pisces | మీన రాశి ఫలాలు 30-03-2024
ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిళ్ళు, శారీరక శ్రమ అధికముగా ఉంటుంది.. ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగములో సమస్యలు, రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి.. మీనరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాల్సి ఉంటుంది.