Monday, April 29, 2024
HomehoroscopeHoroscope Today : 29-03-2024 ఈ రోజు రాశి ఫ‌లాలు

Horoscope Today : 29-03-2024 ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 29th March 2024: Check astrological prediction for your zodiac signs

Aries | మేష రాశి ఫలాలు 29-03-2024

ఈ రాశి వారు ఆదాయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా ఫలిస్తాయి. వ్యాపారంలో ఒక మెట్టు పైకి ఎదిగే అవకాశం ఎక్కువ‌. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది.

Taurus | వృషభ రాశి ఫలాలు 29-03-2024

ఈ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వచ్చే అవ‌కాశం ఉంది.. తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొంత‌ ఇబ్బందికరంగా మారుతాయి.

Gemini | మిథున రాశి ఫలాలు 29-03-2024

ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవ‌కాశం ఉంది.. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం ఏ మాత్రం మంచిది కాదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 29-03-2024

ఈ రాశి వారికి సంబంధించిన వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవ‌కాశం ఉంది.. వృత్తి వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం ఆనందంగా ముందుకు వెళుతుంది.

Leo | సింహ రాశి ఫలాలు 29-03-2024

ఈ రాశి వారు ఒక ముఖ్యమైన సమస్యను కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించు కుంటారు. ఆర్థిక విషయాల్లో బంధువులకు లేదా మిత్రులకు వాగ్దానం చేయకపోవడం చాలా ఉత్త‌మం. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహంగా సాగుతాయి.

-Advertisement-

Virgo | కన్యా రాశి ఫలాలు 29-03-2024

ఈ రాశి వారి సంపాదన ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువ‌గా ఉంది. కుటుంబంలో అపార్ధాలు తలెత్తే అవకాశం ఎక్కువ‌

Libra | తులా రాశి ఫలాలు 29-03-2024

ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు సత్ఫలితా లను ఇస్తాయి. సంపాదన, లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభించే అవ‌కాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ జీవితంలో చాలావరకు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 29-03-2024

ఈ రాశి వారు ఆదాయం కోసం ప్రయ త్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యా ర్థులు గట్టి ప్రయత్నం మీద విజయాలు సాధించే అవ‌కాశం ఉంది.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 29-03-2024

ఈరాశి వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవ‌కాశం ఉంది.. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు బాగుంటుంది.. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్ర‌త్త‌గా ఉండాలి..

Capricorn | మకర రాశి ఫలాలు 29-03-2024

ఈ రాశి వారు కొన్ని కీలక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఉత్త‌మం. ఇతరులకు వాగ్దానాలు చేయటం ద్వారా కొద్దిగా ఇబ్బంది పడే అవ‌కాశం ఉంది.. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు ల‌భించే ఛాన్స్ ఉంది.

Aquarius | కుంభ రాశి ఫలాలు 29-03-2024

ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో చేసే ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. సంపాదన, లాభాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపుకూడా లభిస్తుంది. నిరుద్యోగు లకు విదేశాల నుంచి తీపి కబురు అందే ఛాన్స్ ఉంది.

Pisces | మీన రాశి ఫలాలు 29-03-2024

ఈ రాశి వారు త‌మ భాగస్వామితో సంప్రదించి కుటుంబ సంబంధమైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఆస్తి వ్యవహారం ఒకటి బంధువుల సహాయంతో పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది.

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News