HomehoroscopeHoroscope Today Telugu (19-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today Telugu (19-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 19th february 2024: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి ఈ రోజు రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. స్థాన చలనం కూడా ఉండే అవకాశం ఉంది. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఎక్కువగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అనారోగ్యం రాకుండా జాగ్రత్త వహించాలి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

వృషభం

ఈ రాశి వారికి ఈ రోజు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరే అవకాశం ఉంది. దూర బంధువులతో కలయిక జరిగే అవకాశం ఉంది. దీని ద్వారా ఎన్నో లాభాలు పొందుతారు. విదేశయాన ప్రయత్నాలు కూడా ఈ రోజు ఫలించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కూడా ఏర్పడే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.

మిథునం

ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అయితే, ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అనారోగ్య బాధవల్ల కొంత బలహీనంగా అనిపించవచ్చు. అధికార భయం కూడా ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు వివాదాలలో ఇన్వాల్వ్ కాకుండా ఉండటం మంచిది.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈ రోజు చాలా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాల గురించి మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.

సింహం

ఈ రాశి వారికి ఈ రోజు మానసిక ఆనందం లభించే అవకాశం ఉంది. గతంలో వాయిదా వేయబడిన పనులు అన్ని పూర్తయ్యే అవకాశం ఉంది. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు కూడా ఈ రోజు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

-Advertisement-

క‌న్య

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీకు విజయం సిద్ధిస్తుంది, మరికొన్నింటిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తిపరంగా ఈరోజు మీకు ఒత్తిడితో కూడుకున్న రోజు అవుతుంది. పనిభారం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి అవగాహన ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు మీకు ఒక శుభవార్త అందుతుంది.

తుల‌

డబ్బు విషయంలో ఈ రాశి వారికి చాలా అనుకూలమైన సమయం. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్నేహితులను కలిసే అవకాశం లభిస్తుంది. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంది.
సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ధైర్యంతో కొన్ని కష్టమైన పనులను పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.

వృశ్చికం

ఈ రోజు మీకు తోటివారితో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. మాటలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారంలో కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.
అవసరం లేని ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల పట్ల అంతగా శ్రద్ధ చూపించరు. స్త్రీలు ఈ కాలంలో ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. తగినంత విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరం. ఈ రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

ధ‌నుస్సు

ఈ రోజు మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో కొన్ని మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది.

మకరం

ఈ రాశి వారికి ఈ రోజు కొంచెం కష్టంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని క్ర‌మంగా ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఉండే అవకాశం ఉంది.
వృత్తి, ఉద్యోగ రంగంలో మాత్రం అభివృద్ధి ఉంటుంది. కానీ, మానసిక ఆందోళనతో కొంత‌ కాలం గడుస్తుంది. ఎంత ప్రయత్నించినా అన్ని ప‌నులు పూర్తిచేసుకోలేక పోతారు.

కుంభం

ఈ రాశి వారికి ఈ రోజు కొంచెం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల ద్వారా చాలా లాభం పొందుతారు. మీరు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త కార్యాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

మీనం

ఈ రాశి వారికి ఈ రోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇతరులతో గౌరవం పొందేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. కానీ, కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను కొంత ఎదుర్కోవాల్సి వస్తుంది.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News