Homehoroscopehoroscope today july 22, 2023 - ఈ రోజు రాశి ఫలాలు 22-07-2023

horoscope today july 22, 2023 – ఈ రోజు రాశి ఫలాలు 22-07-2023

Telugu Flash News

horoscope today july 22, 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Aries horoscope

ఈ రాశి వారు మానసిక ప్రశాంతతను పొందేందుకు మరియు అనవసర విషయాలకు సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Taurus horoscope

ఈ రాశివారు విబేధాలు క‌ల‌గ‌కుండా చూసుకోవాలి. మీ పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు. శారీరకంగా అధికంగా శ్రమ పడితే మంచి విజ‌యాలు సాధిస్తారు. శ్రద్ధగా పనిచేసి శుభ ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Gemini

ఈ రాశివారు నూతన వస్తువు, బట్టలను కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులను త్వ‌రగా పూర్తి చేస్తారు. శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అవసరాలకు ధనం చేకూరడ‌డంతో ఆనందంగా ఉంటారు. కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Cancer horoscope

ఈ రాశి వారు ఇత‌రుల‌ సహకారంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కీలక వ్యవహారంలో దైర్యంగా ముందుకు అడుగు వేస్తే మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించే ఫలితాలను అందుకుంటారు. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

horoscope today in telugu

-Advertisement-

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Leo

ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనిని సులభంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Virgo

ఈ రాశివారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మంచి పనులు చేపడతారు. అనవసర ఆందోళనకు దూరంగా ఉండడం మేలు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు అవసరానికి డబ్బులు అందుకుంటారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. సాయం అందుకుంటారు. చేప‌ట్టిన ప్ర‌తి విష‌యంలో అంతటా విజయం ఉంది. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Scorpio

ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇస్తారు. చేపట్టిన పనుల్లో కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్ల‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. మానసికంగా శాంతి కలుగుతుంది. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Saggitarius

ఈ రాశి వారు వృత్తి, విద్య, ఉద్యోగాల్లో ఆర్థికాభివృద్ధిని అందుకుంటారు. శుభవార్త వింటారు. ఏ ప‌ని మొదలుపెట్టిన ఆ పనులను సులభంగా పూర్తి చేస్తారు. అధిక ఒత్తిడిని దరిచేరనీయకండి.ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండండి. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్నలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Capricorn horoscope

ఈ రాశివారు బంధు, మిత్రుల సహకారంతో అనుకూల ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో అలసత్వం విడనాడడం మంచిది. చేపట్టిన పనుల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని దాటి ముందుకు సాగి విజయం సాధిస్తారు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Aquarius

ఈరాశివారు శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు అభివృద్ధికి సంబంధించి ఇతరుల సహకారంతో ముందుకు సాగడం వల్ల తమ పని సులువవుతుంది. అవసరానికి ఆర్థిక సహకారం అందుకుంటారు. సమయ పాలనతో అన్ని పనులను పూర్తిచేస్తారు. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశంఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు july 22, 2023 Pisces horoscope

ఈ రాశివారు ప్రతిభతో పనితీరుకు తగిన ప్రశంసలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకోవ‌డం జ‌రుగుతుంది.. ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలు రావ‌డం సంతోషంగా ఉంటుంది.. ముఖ్యమైన పనుల విషయంలో ఆర్ధిక పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.

also read :

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Weather Report : దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం!

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News