HomehoroscopeHoroscope Today in Telugu (20-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today in Telugu (20-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 20th february 2024: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Aries horoscope

ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మాత్రం కొంత మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అయితే ఆహార విహారాల్లో కొంత జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Taurus horoscope

ఈ రాశి వారికి ఈ రోజు కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Gemini

ఈ రాశి వారికి ఈ రోజు చిన్ననాటి స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఒకరిద్దరు స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కొందరు బంధువులకు సలహాలు ఇచ్చి సాయపడతారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Cancer horoscope

ఈ రాశి వారిని ఈ రోజు కొందరు స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆహార విహారా యాత్రల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్స్ వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Leo

ఈ రాశి వారు ఈ రోజు పొదుపు సూత్రాలు పాటిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. అధికారులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Virgo

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు నిలకడగా ఉంటుంది. కొందరు బంధువులు లేనిపోని మాటల వలన కొంత ఇబ్బంది పెడతారు. మీ నుంచి సహాయం పొందిన వారు మీ ముఖం చాటేయడం కొంత బాధను కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో చాలా ఆసక్తి చూపుతారు.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Libra horoscope

ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ఈ రోజు సాఫీగా సాగిపోతుంది. మిమ్మల్ని అనవసర ఖర్చులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో పెద్దల నుంచి ఆర్థికంగా సహాయ సహకారాలు బాగానే లభిస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Scorpio

ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆదాయపరంగా కొంత నిలకడగానే ఉంటుంది. విలాసాల మీద ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు చాలానే వింటారు. ప్రేమ వ్యవహారాలు కొంత నిరుత్సాహం కలిగిస్తాయి.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Saggitarius

ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో కొత్త మార్గాలు వెతుకుతారు. ఆరోగ్యం మంచిగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే సూచనలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లల నుంచి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. శుభవార్తలు ఎక్కడ ఎక్కువగా వింటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Capricorn horoscope

ఈ రాశి వారు అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల నుంచి మంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు తలుపుతడతాయి. వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతాయి.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Aquarius

ఈ రాశి వారికి సహచరుల నుంచి అండదండలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. వాగ్దానాలు చేయడం, హామీ ఇవ్వడం ప్రస్తుతానికి ఏ మాత్రం మంచిది కాదు. ప్రేమ వ్యవహారాలు మీకు నిరుత్సాహం కలిగిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 20, 2024 Pisces horoscope

ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత ఎంతో పెరుగుతుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం, మద్దతు లభిస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. సునాయాసంగా ముఖ్యమైన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది.

 

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News