Homehoroscopehoroscope today in telugu : 06-08-2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu : 06-08-2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, august 06, 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ముఖ్యమైన విషయాలు మరియు పనులతో వ్యవహరించేటప్పుడు కుటుంబ సభ్యుల సహాయం కోరడం ఈ రాశికి చెందిన వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని విషయాలు మానసిక ఆనందాన్ని క‌లిగిస్తాయి.. కుటుంబీకులు, బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. గోసేవ చేస్తే మరింత మేలు క‌లుగుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడుతారు. స్త్రీలు మనోలాసాన్ని పొందుతారు.

వృషభం

ఈ రాశి వారు బంధు, మిత్రులను కలుసుకుంటారు. సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రయాణ ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి, గణపతిని పూజించడం వల్ల శుభం కలుగుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం.

మిథునం

ఈ రాశివారు త‌ప్ప‌క శుభవార్త వింటారు. అధికారులకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే, అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మరియు పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. బంధు, మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని దర్శించుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంలో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు.

కర్కాటకం

ఈ రాశి వారు నేడు శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూల పరిణామాలు ఏర్ప‌డ‌తాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల ఆశీర్వచనాలు, సలహాలు తీసుకోవ‌డం మంచింది. మహాలక్ష్మి దర్శించుకుంటే అనుకూల ఫలితాలు పొందే అవ‌కాశం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.

today horoscope

-Advertisement-

సింహం

ఈ రాశి వారు విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. పెద్దల సహకారం ల‌భిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన చేయ‌డం మంచిది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.

కన్య

సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది. ముందుచూపుతో ముందుకు సాగితే ఎలాంటి అవ‌రోధాలు రావు. అప్పుడే అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో అభిప్రాయబేధాలు రానివ్వ‌కుండా చూసుకోండి. కొందరితో అభిప్రాయ భేదాలు కలుగుతాయి. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

తుల

మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కాస్త‌ పెరుగుతాయి. కొందరి ప్రవర్తన మ‌న మనసుకు బాధ కలిగిస్తుంది. అవకాశాల విషయంలో నిరాశా నిస్పృహలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఏర్ప‌డతాయి. గోసేవ చేయ‌డం మంచింది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

వృశ్చికం

ఈ రాశి యొక్క వ్యక్తులు అనుకూలమైన ఫలితాలను అనుభవిస్తారు. ఉద్యోగ సంబంధిత విషయాలకు సంబంధించి అధికారుల ఆమోదం పొందడంలో విజయం సాధిస్తారు. విరోధులపై మీదే పైచేయి అవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.. హనుమంతుడిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది. విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి.

ధనస్సు

ఈరాశివారు నూతన వస్తువులు కొంటారు. ఆత్మస్థైర్యంతో అనుకున్న పనులు పూర్తిచేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబం మరియు ప్రియమైనవారితో ఆనందం పంచుకుంటారు . హనుమాన్ చాలీసా చదవడం వల్ల సానుకూల ఫలితాలు ఏర్ప‌డతాయి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి.

మకరం

మీరు చేపట్టే పనులు ప్రణాళిక ప్రకారం పూర్తయ్యేలా చూసుకోండి. అవసరమైన విధంగా తగిన మద్దతు మరియు సహాయం అందుబాటులో ఉంటుంది. కొన్ని విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. శ్రమాధిక్యం తప్పదు. దుర్గాదేవిని ఆరాధిస్తే శుభ ఫ‌లితాలు ఏర్ప‌డ‌తాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కుంభం

మీ కెరీర్ మరియు వ్యాపారానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యమైన విషయాల్లో స్పష్టత, నిజాయితీ, సూటిగా వ్యవహరించడం మంచిది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.

మీనం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.. బంధువులతో కలహ సూచనలు ఎక్కువ అవుతాయి.. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.. లక్ష్మీ గణపతి ఆరాధనతో శుభం త‌ప్ప‌క కలుగుతుంది. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.

also read :

BRO Movie Making Video : బ్రో మేకింగ్ వీడియో చూశారా ?

10 health benefits of sweet potatoes : స్వీట్ పొటాటో ప్రయోజనాలు ఎన్నో!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News