Monday, May 13, 2024
HomevideosBRO Movie Making Video : బ్రో మేకింగ్ వీడియో చూశారా ?

BRO Movie Making Video : బ్రో మేకింగ్ వీడియో చూశారా ?

Telugu Flash News

BRO Movie Making Video : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు అతని మేనల్లుడు సాయి తేజ్ నటించిన “బ్రో” చిత్రం ఘన విజయం సాధించింది. దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. తమిళంలో ఘనవిజయం సాధించిన వినోదయ సితం కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. విడుదలకు ముందు మెగా అభిమానులు చేసిన సందడి గురించి చెప్పనక్కర్లేదు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా హిట్ అవ్వడంతో మేకర్స్ బ్రో సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేశారు. మెగా అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ చిత్రబృందం విడుదల చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. పవన్, సాయి ధరమ్ తేజ్ జోష్ సెట్‌లో విశేషంగా ఆకట్టుకుంది.

అలాగే ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. అంతేకాదు ఈ సినిమా మొదటి నుంచి దగ్గరి నుంచి వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్రో మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది. తమన్ అందించిన సంగీతంతో పాటు నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. బ్రో మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

also read :

BRO telugu movie review : బ్రో తెలుగు సినిమా రివ్యూ

BRO: బ్రో టైటిల్ వెన‌క ఇంత అర్ధం ఉందా.. త్రివిక్ర‌మ్ ఆలోచ‌న మాములుగా లేదు..!

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News