HomedevotionalHoroscope (28-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (28-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 28th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Aries horoscope

ఈ రాశి వారు బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ పాటించాలి. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకోసం ఎక్కువ శ్రమించే అవ‌కాశం ఉంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Taurus horoscope

ఈ రాశి వారికి రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే ఎంతో గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఎక్కువ‌. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం ఎంతో మంచిది. అనారోగ్య బాధలు చాలా వేధిస్తాయి.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Gemini

ఈ రాశి వారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలం అవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Cancer horoscope

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో ఎంతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ధనచింత ఏ మాత్రం ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు ఎంతో లభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Leo

ఈ రాశికి చెందిన వారి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా ఎంతో మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం ఎంతైన అవ‌స‌రం. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ త‌ప్ప‌నిస‌రి

-Advertisement-

horoscope today in teluguకన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Virgo

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు చాలా అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను క‌లిసే అవ‌కాశం ఉంది.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Libra horoscope

ఈ రాశి వారికి ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి కొంత లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం అవ‌స‌రం. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఎక్కువ‌.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Scorpio

ఈ రాశికి చెందిన వారి ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం ఎంతైన అస‌వ‌రం.. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేసే అవ‌కాశం ఉంది.. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Saggitarius

ఈ రాశి వారు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను కొంత అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ఎంతో ప్రయత్నించాలి.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Capricorn horoscope

ఈ రాశికి చెందిన వారి కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో కొంత ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్తలు వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే ఛాన్స్ ఉంది.. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఏ మాత్రం ఉండవు.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Aquarius

ఈ రాశికి చెందిన వారు గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సిన అవ‌స‌రం వస్తుంది. ప్రయాణాలు ఎక్కువ‌గా చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 28, 2023 Pisces horoscope

ఈ రాశికి చెందిన వారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పనిస‌రి. కలహాలకు దూరంగా ఉండటానికి చాలా ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం కొంత‌ ఏర్పడుతుంది.

also read :

NTR 30: వాయిదా ప‌డ్డ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు లాంచ్ కానుందంటే..!

walnuts for kids : పిల్లల చదువులపై ఒత్తిడి ఉందా? ఈ నట్స్ ట్రై చేయండి!

Alia Bhatt at Zee Cine Awards 2023 Photos and Videos

How to Stop Wasting Time : మీ సమయాన్ని వృధా చేసుకోకండి

moral stories in telugu : చేసిన సహాయం ఎప్పుడూ వృధాకాదు

Anasuya: అన‌సూయ ‘ఆంటీ’ పై న‌టి క‌స్తూరి వివ‌ర‌ణ‌.. అది డ‌ర్టీ మీనింగ్ అంటూ కామెంట్

Samantha : చైతూ వ‌ల‌న స‌మంత ఇంకా ఇబ్బంది ప‌డుతుందా?

Kiara Advani hot at Zee Cine Awards 2023 Photos and Videos

Rashmika Mandanna hot at Zee Cine Awards 2023 Photos and Videos

 

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News