Homeandhra pradeshExtramarital Affair : ప్రియురాలికి వీడియో కాల్‌ చేసి మరీ తండ్రిపై దాడి..

Extramarital Affair : ప్రియురాలికి వీడియో కాల్‌ చేసి మరీ తండ్రిపై దాడి..

Telugu Flash News

Extramarital Affair news in andhra pradesh : సమాజంలో వింత కేసులు వెలుగు చూస్తున్నాయి. మానవ సంబంధాలను మట్టిలో కలిపేస్తూ.. నేరాలు చేయడానికి జనం వెనుకాడటం లేదు. అనుబంధాలకు పాతరేస్తూ అయిన వారినే కాటికి పంపేందుకు సిద్ధమవుతున్నారు.

ముఖ్యంగా కోరుకున్న సుఖం కోసం ఎంతటి నీచానికైనా దిగజారే విష సంస్కృతి వ్యాపిస్తోంది. తాజాగా తన బంధానికి అడ్డుగా వస్తున్నాడని తండ్రిపైనే కర్కశంగా దాడికి పాల్పడిన తనకుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. కసితో రగిలిపోయిన కొడుకు ఏకంగా ప్రియురాలికి చూపిస్తూ తండ్రిపై దాడి చేయడం గమనార్హం.

చిత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. గాంధీరోడ్డులో ఢిల్లీబాబు తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. హోంగార్డుగా పని చేస్తున్న ఢిల్లీబాబుకు ఒక్కగానొక్క కుమారుడు భరత్‌ సంతానం. 21 ఏళ్ల భరత్‌ను తండ్రి అల్లారుముద్దుగా పెంచాడు.

బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తాడనుకున్న కొడుకు.. ఇలా తన ప్రాణానికే ముప్పు తలపెడతాడని ఆ తండ్రి ఊహించలేకపోయాడు. ఆకతాయి చేష్టలు చేస్తూ తరచూ పట్టుబడుతుండేవాడు. ఈ క్రమంలోనే చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు.

కాలేజీకి వెళ్లి చదువుకోకుండా బయట తిరుగుతుండేవాడు. దీనిపై అనుమానం వచ్చిన తండ్రి.. భరత్‌ను కాలేజీ మానిపించి కూలిపనులకు పంపడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే బైపాస్‌ రోడ్డు సమీపంలో కొత్తూరుకు చెందిన 39 ఏళ్ల ఝాన్సీ అనే వివాహితతో పరిచయం పెంచుకున్నాడు.

ఆమె భర్తకు విడాకులిచ్చి దూరంగా ఉంటోంది. దీంతో వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తన కంటే వయసులో పెద్దదైన, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమెను భరత్‌ ఇంటికి తీసుకొచ్చి కన్నవారి ముందే చనువుగా ఉండటం మొదలుపెట్టాడు.

-Advertisement-

ఈ నేపథ్యంలోనే తనయుడి ఆగడాలు చూసి తట్టుకోలేకపోయిన తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. భరత్‌ను, ఝాన్సీని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. అనంతరం కూడా భరత్‌లో మార్పు రాలేదు. దీంతో కుమారుడికి గట్టిగా నిలదీయడంతో తండ్రిపై భరత్‌ కక్ష పెంచుకున్నాడు.

తన బంధానికి అడ్డుగా వస్తున్నాడని ఆదివారం సాయంత్రం ఝాన్సీకి వీడియో కాల్‌ చేసి తండ్రిని చితకబాదాడు. ఇందుకు అడ్డు చెప్పిన తల్లిని కూడా కొట్టాడు. ఢిల్లీబాబును స్థానికుల సాయంతో తల్లి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తోంది. కుమారుడిపై వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

also read :

Actress Pooja Hegde Hot at Zee Cine Awards 2023 Event

Alia Bhatt at Zee Cine Awards 2023 Photos and Videos

Kiara Advani hot at Zee Cine Awards 2023 Photos and Videos

Rashmika Mandanna hot at Zee Cine Awards 2023 Photos and Videos

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News