HomecinemaAnasuya: అన‌సూయ 'ఆంటీ' పై న‌టి క‌స్తూరి వివ‌ర‌ణ‌.. అది డ‌ర్టీ మీనింగ్ అంటూ కామెంట్

Anasuya: అన‌సూయ ‘ఆంటీ’ పై న‌టి క‌స్తూరి వివ‌ర‌ణ‌.. అది డ‌ర్టీ మీనింగ్ అంటూ కామెంట్

Telugu Flash News

Anasuya: నటి కస్తూరి పేరు చెప్పగానే అన్నమయ్య, భారతీయుడు లాంటి చిత్రాలు మ‌న క‌ళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి.. తమిళ తెలుగు భాషల్లో కథానాయికగా ఆమె అనేక చిత్రాల్లో న‌టించిన క‌స్తూరి గృహలక్ష్మి టీవీ సీరియల్ సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది.

ఐదు పదుల వయసులో కూడా నటి కస్తూరి అందమైన లుక్స్ తో ఆక‌ట్టుకుంటుంది. తాజాగా ఇంటర్వ్యూలో సంచలన విషయాల‌పై మాట్లాడింది క‌స్తూరి.

అనసూయని నెటిజన్లు ఆంటీ అని పిలవడంతో ఎంత పెద్ద వివాదం రేగిందో మ‌నం చూశాం. తాజాగా ఈ వివాదం గురించి ఇంటర్వ్యూలో కస్తూరి బదులిస్తూ.. మనల్ని చిన్న పిల్లలు ఆంటీ అని పిలవడానికి.. పెద్దవాళ్ళు పిలవడానికి చాలా తేడా ఉంటుంది క‌దా…

మీరు అడల్ట్ అయితే ఒక మహిళని ఆంటీ అని పిలవడం సరైన పద్దతి కాదు క‌దా .. ఒక నటుడినో లేదా హీరోనో వాళ్ళు వయసైనవాళ్లు అయినప్పటికీ వెళ్లి అంకుల్ అని పిలిచే ధైర్యం ఉందా ? అని కస్తూరి ప్రశ్నించింది.

ఆంటీ అనే పదానికి ఇప్పటికే ఒక డర్టీ మీనింగ్ వచ్చేసిందని, అనసూయ కన్నా వయసులో రెట్టింపు ఏజ్ ఉన్న నటులు కూడా ఉన్నారు. మ‌రి వారిని అంకుల్ అని పిలవండి.. పిలవగలరా ?

వారి మైండ్ లో డర్టీ థాట్స్ అయినా ఉండాలి లేదా అవమానించే విధంగా అయినా పిలవాలి అంటూ క‌స్తూరి ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇవి ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

-Advertisement-

also read :

Kiara Advani hot at Zee Cine Awards 2023 Photos and Videos

Rashmika Mandanna hot at Zee Cine Awards 2023 Photos and Videos

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News