Telugu Flash News

Horoscope (16-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

horoscope today in telugu

Horoscope Today, 16th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. కొద్దిగా రుణ సమస్యలను తగ్గించుకుంటే మంచిది. మంచి రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువ‌.

వృషభం

ఈ రాశి వారు ఇష్టమైన వాళ్లతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి కొంత నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరు దగ్గర బంధువులను ఆదుకునే అవ‌కాశం ఉంది.. వృత్తి వ్యాపారాల్లో క్ర‌మంగా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం కాస్త‌ నిలకడగా ఉంటుంది.

మిథునం

ఈ రాశి వారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతారు. బంధు వర్గంలో వారితో పెళ్లి సంబంధం కుదిరే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో అపార్ధాలు తలెత్తే అవకాశం ఎక్కువ‌. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి.. విద్యార్థులకు ఈ రోజు బాగానే ఉంటుంది.

కర్కాటకం

ఈ రాశికి చెందిన ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రుణ బాధ చాలావరకు తగ్గే అవ‌కాశం ఉంది. విదేశాల నుంచి నిరుద్యోగులకు మంచి కబురు అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగే అవ‌కాశం లేదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొంత నిరుత్సాహం కలిగిస్తాయి.

సింహం

ఈ రాశికి చెందిన వారు ఒక ముఖ్యమైన సమస్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది కానీ ఖర్చులు కాస్త అదుపు తప్పుతాయి. ఆధ్యాత్మిక చింతన క్ర‌మంగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తారు.

కన్య

ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు కాస్త‌ తగ్గించుకోవాలి. ఉద్యోగం ఆశాజనకంగానే ఉంటుంది. పురోగతికి అవకాశం ఎక్కువ‌గా ఉంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. పలుకుబడి గల వారితో పరిచయాలు క్ర‌మంగా ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండ‌డం మంచింది

తుల

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. మొండి బాకీలు క్ర‌మంగా వసూలు అవుతాయి. ఉద్యోగులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి కొన్నిప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంది.. నిరుద్యోగులకు విదేశాల నుంచి తీపి కబురు అందుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లకు కూడా క్ర‌మంగా డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది.

వృశ్చికం

ఈ రాశికి చెందిన వారు ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం పరిస్థితి నిలకడగానే ఉంటుంది. స్నేహితుల సహాయంతో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవ‌కాశం ఉంది.. బంధువులతో కొంత‌ విభేదాలు ఏర్పడతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు క్ర‌మంగా ఫలిస్తాయి.

ధనుస్సు

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి ఆర్థిక సహాయం అందే అవ‌కాశం ఉంది. రుణ సమస్యలను చాలా వరకు తగ్గించుకోగ‌లుగుతారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవ‌కాశం ఉంది. . ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

మకరం

ఈ రాశి వారికి వ్యాపారంలో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలు గడిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ముందుకు దూసుకు వెళ్లే ఛాన్స్ ఉంది. బంధు వర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు ఎక్కువ‌గా చేస్తారు.

కుంభం

ఈ రాశి వారు కుటుంబ పరంగా ఒకటి రెండు సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవ‌కాశం ఉంది. దూరప్రాంతాల నుంచి కూడా స‌మాచారం అందుకుంటారు.

మీనం

ఈ రాశి వారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు స‌క్ర‌మంగా సమకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గానే ఉంటాయి. ఆశాభావంతో ఉన్న ఒక పెళ్లి సంబంధం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. టీచర్లకు, కళాకారులకు, రియల్ ఎస్టేట్ వారికి, ఐటీ వారికి ఇది మంచి స‌మ‌యంగా చెప్పుకోవ‌చ్చు.

Also Read :

Viral Video : మూగజీవాన్ని ముద్దు చేయబోయింది.. చివరకు ఊహించని ట్విస్ట్‌!

KTR On Amit Shah : అమిత్‌ షాకు మంత్రి కేటీఆర్ థ్యాంక్స్‌.. ఏ విషయంలో అంటే..

Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక మలుపు.. అవినాశ్‌ రెడ్డి అనుచరుడి అరెస్ట్‌

Ananya Nagalla: న‌న్ను ఎవ్వరూ ట్రై చేయ‌లేదు.. అన‌న్య ఆస‌క్తిక‌ర కామెంట్స్

Upasana: మెగా కోడ‌లు ఉపాస‌న త‌న సంపాద‌న మొత్తం వారికే ఇచ్చేసిందా?

క్యాన్సర్‌ ముప్పును తగ్గించే ఫుడ్స్‌ ఇవే

Pooja Hegde: సల్మాన్ ఖాన్ తో డేటింగ్‌పై స్పందించిన పూజా హెగ్డే

Sai dharam Tej: జ‌బ‌ర్ధ‌స్త్ షోలో సాయి ధ‌ర‌మ్ తేజ్ సంద‌డి.. యాంక‌ర్‌పై అదిరిపోయే పంచ్‌లు..!

Exit mobile version