Monday, May 13, 2024
Homedevotionalhoroscope today 15 June 2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today 15 June 2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 15th june 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Aries horoscope

కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్థలు ఈరోజు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలలో కొన్ని విషయాల్లో పట్టుదలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. స్వల్ప ధనలాభం కలిగే సూచనలున్నాయి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Taurus horoscope

ఈరోజు ఇంటి లోపల మరియు ఆరుబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కావు మరియు చికాకులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో నగదు లేదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులకు వారి శ్రమకు ప్రతిఫలం లేదు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Gemini

ఈరోజు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. సంప్రదాయాలను నెరవేర్చగల సమర్థుడు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Cancer horoscope

ఈరోజు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. భూమికి సంబంధించిన కొత్త క్రయవిక్రయాల్లో లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో జీతాలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Leo

ఈరోజు ఉద్యోగులకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ మంచిది కాదు.

-Advertisement-

today horoscope in telugu

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Virgo

కొత్త వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈరోజు వేగవంతమవుతాయి. దూరపు బంధువుల నుండి వచ్చే వార్తలు సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాలలో చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో కొత్త లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ప్రత్యేకంగా పాల్గొంటారు.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Libra horoscope

మీరు ఈరోజు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కొత్త రుణ ప్రయత్నాలు వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Scorpio

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది. మీరు చేపట్టిన పనిలో చాలా శ్రమకు తక్కువ ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు కొన్ని విషయాల్లో మిశ్రమంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ ఆహ్వానాలు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Saggitarius

ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాల రాజీ. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అధికారులచే ప్రశంసించబడుతుంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Capricorn horoscope

భాగస్వామి వ్యాపారాలు ఈరోజు లాభాల బాటలో ఉంటాయి. అమ్మకాలు మరింత ఉత్సాహంగా ఉంటాయి. రాజకీయ చర్చలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Aquarius

ఆర్థిక ఇబ్బందులు ఈరోజు కొంత చికాకు కలిగిస్తాయి. పెద్దలతో కుటుంబ విషయాలు చర్చిస్తారు. చేపట్టిన వ్యవహారాలు చక్కగా సాగుతాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు june 15, 2023 Pisces horoscope

ఈరోజు చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. పాత మిత్రుల నుంచి శుభ ఆహ్వానాలు అందుతాయి. కంటి సంబంధిత రుగ్మతలు ఉన్నాయి. బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

read more news :

Cyclone Biparjoy : మూడు రోజుల పాటు కరెంటు ఉండదు.. ఏర్పాట్లు చేసుకోవాలని అధికారుల సూచన

అజిత్ దోవల్ పై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News