HomedevotionalHoroscope (02-03-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (02-03-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 2nd March 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Aries horoscope

ఈ రాశి వారికి సంబంధించిన బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమించే అవ‌కాశం ఉంది.. అనవసర నిందలతో అపకీర్తి వచ్చే ఛాన్స్ ఉంది.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ప‌డ‌తారు..

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Taurus horoscope

ఈ రాశి వారు ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే ఉత్త‌మం. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభించే అవ‌కాశం ఉంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Gemini

బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందుల ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Cancer horoscope

ఈ రాశి వారు ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టే అవ‌కాశం ఉంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేసే ఛాన్స్ ఉంది. గొప్ప వ్యక్తుల‌ని క‌ల‌వ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Leo

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేసే అవ‌కాశం ఎక్కువ‌. ముఖ్యమైన వ్యక్తులను కలిసే ఛాన్స్ ఉంది. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధించ‌గ‌లుగుతారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణవిముక్తి లభించ‌డ‌మే కాక‌, మానసిక ఆనందం పొందుతారు.

-Advertisement-

horoscope today in teluguకన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Virgo

ఈ రాశి వారికి రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయం పొందే ఛాన్స్ ఉంది.. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరే అవ‌కాశం ఎక్కువ‌.. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు ఎక్కువ‌గా చేపడతారు. గౌరవ మర్యాదలు ద‌క్కుతాయి.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Libra horoscope

ఈ రాశి వారు ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అయ్యే ఛాన్స్ ఉంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడాల్సి ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Scorpio

ఈ రాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఎక్కువ‌. అన్నింటా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం ఎంతైన మంచిది.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Saggitarius

ఈ రాశి వారికి వ్యవసాయ రంగం లాభదాయంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోయే అవ‌కాశం ఉంది.. చెడును కోరేవారికి దూరంగా ఉండటం ఉత్త‌మం . ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడే ఛాన్స్ ఉంది.

horoscope 2023మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Capricorn horoscope

ఈ రాశి వారికి అకాల భోజనం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అస్స‌లు మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం ఉత్త‌మం. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా మంచిది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Aquarius

ఈ రాశికి చెందిన వారు పిల్లలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడే అవ‌కాశం ఎక్కువ‌. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకేనే అవ‌కాశం ఉంది.. అనారోగ్య బాధలు క్ర‌మంగా తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం ఉత్త‌మం. నూతన వ్యక్తులు పరిచయం అయ్యే ఛాన్స్ ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు March 02, 2023 Pisces horoscope

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడిపే అవ‌కాశం ఎక్కువ‌. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ద‌క్కుతుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు చాలానే ల‌భిస్తాయి.

Also Read :

Border-Gavaskar Trophy 2023: తొలి రోజు ఆస్ట్రేలియా డామినేషన్‌.. టపాటపా పడిపోయిన టీమిండియా వికెట్లు

Raashi Khanna Latest instagram photos, images, stills 2023

Malavika Mohanan Latest Stills, Images,Instagram Photos 2023

Sreeleela : క్ష‌మాప‌ణ‌లు చెప్పిన నటి శ్రీలీల.. కార‌ణం ఏంటి?

kangana ranaut tweet : ఆ హీరోయిన్స్ లాగా రాత్రుళ్లు హీరోల రూమ్స్‌కి వెళ్ల‌లేదు

Curd with Sugar : పెరుగులో చక్కెర కలిపి తింటే ప్రమాదమా?

Varsha: ఎట్ట‌కేల‌కు జ‌బ‌ర్ధ‌స్త్ వర్ష పెళ్లి బాజా మొద‌లైంది.. వ‌రుడు ఎవ‌రంటే..!

hair colour : శిరోజాలకు రంగు వేసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు..

moral stories in telugu : మంచి స్నేహితుని కోల్పోయిన సింహం

Sonam kapoor Profile, Photos, Images, Stills 2023

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News