Cold Remedies: జలుబు తగ్గడానికి వైద్యుడిని సంప్రదించకుండా ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- కొత్తిమీర ఆకులు వాసన పీల్చుచుండినచో తరచు వచ్చు తుమ్ములు తగ్గును.
- మొదటి ముద్దలో మిరియపు పొడి, ఉప్పు కలిపి తినినచో జలుబు దరిదాపులకే రాదు. మిరియాల పొడిని తేనెతో కలిపి తినినచో జలుబు తగ్గును.
- మిరియాలపొడి పెరుగును కలిపి తినినచో రొంప / జలుబు తగ్గును.
- వెల్లుల్లిపాయను కాల్చి మొదటి ముద్దలో తినినచో జలుబు తగ్గిపోవును.
- జీలకర్రను పొడిచేసి, తడిగుడ్డలో ఉంచి వాసన పీల్చుచుండిన యెడల జలుబు, తుమ్ములు తగ్గును.
- రాత్రి పడుకొను సమయములో ముక్కు బాగా దిబ్బడ వేసి బిగించినట్లు ఉన్నచో ఆవనూనెతో ముక్కుపై మసాజ్ చేయవలెను. * ముక్కు ఎండిపోయనట్లు అనిపించినచో 1 చెంచా ఉప్పు, రెండున్నర కప్పుల వేడి నీటిలో కరగించి ఆ ద్రవమును కొంచెము అరచేతిలో వేసుకొని ముక్కుతో పీల్చవలెను.
Nutrition tips : ఆరోగ్య పరిపుష్టికి పాటించాల్సిన అద్భుతమైన చిట్కాలు..!
Vitamin Poisoning : అధిక మొత్తంలో విటమిన్లు తీసుకుంటే కలిగే నష్టాలు ?
remedies for piles : పైల్స్ సమస్యకు అద్భుతమైన పరిష్కారం.. ఈ ఆయుర్వేద వైద్య చిట్కాలను పాటించండి..
-Advertisement-
-Advertisement-