Harsha Bhogle: ఇటీవల దీప్తి శర్మ చేసిన రనౌట్ వ్యవహారం ఎంత రచ్చగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇటీవల ఛార్లీ డీన్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రన్ అవుట్ చేసినందుకు దీప్తి శర్మపై ఇంగ్లాండ్ మీడియా ఎంత అత్యుత్సాహం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో హర్షా భోగ్లే స్పందించాడు. వారి సంకుచిత సంస్కృతిని ఎండగట్టాడు.
దీప్తి క్రికెట్ చట్టాల ప్రకారం ఆడిందని.. ఆమె మీద ఎలాంటి విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇంగ్లాండ్ మీడియా మీ ప్లేయర్ తప్పును కప్పేసి.. దీప్తిని దోషిగా నిలబెట్టే పని చేయడం కరెక్ట్ కాదు అంటూ మండిపడ్డారు.
హర్షా భోగ్లే ఆగ్రహం..
క్రీజు దాటుతూ ఇల్లీగల్ ప్రయోజనాన్ని పొందడం కోసం ప్రయత్నించిన ఛార్లీ డీన్‌ను ముందు ప్రశ్నించండి అని హర్షా భోగ్లే ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ ఆడే దేశాలను వారు పాలించినందున.. క్రికెట్లో వాళ్లు చెప్పిందే రైట్, రాంగ్ అని పడిపోయాయి. తత్ఫలితంగా ఇంగ్లాండ్ ఏదీ తప్పంటే అది తప్పనే విషయాన్ని పరిగణించడం అసలు సమస్యగా మారింది.
ప్రపంచంలోని మిగతా క్రికెట్ దేశాల జట్లు ఇంగ్లాండ్‌లా ఆలోచించాల్సిన అవసరం లేదు. చట్టాల ప్రకారం స్పష్టంగా ఏది తప్పో దాన్ని పాటిస్తే చాలు అంటూ హర్షా భోగ్లే గట్టిగానే బదులు ఇచ్చాడు.
ఇక ఆ మ్యాచ్‌లో ఛార్లీ డీన్ కీలక ఇన్నింగ్స్ ఆడగా, ఇంగ్లాండ్ మరో 17పరుగులు చేసే విజయం సాధిస్తుంది. అయితే కేవలం చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉండగా, నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో పదే పదే బంతి విసరకముందే క్రీజు వీడుతున్న ఛార్లీ డీన్ అత్యుత్సాహాన్ని గమనించిన దీప్తి మన్కడింగ్ పద్ధతిలో ఔట్ చేయగా, ఇండియా మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాటికి మన క్రికెటర్స్ గట్టిగానే బదులు ఇస్తున్నారు.