HomecinemaPonniyan Selvan: పొన్నియ‌న్ సెల్వన్ చిత్రాన్ని ఎంత మంది హీరోలు మిస్ చేసుకున్నారో తెలుసా?

Ponniyan Selvan: పొన్నియ‌న్ సెల్వన్ చిత్రాన్ని ఎంత మంది హీరోలు మిస్ చేసుకున్నారో తెలుసా?

Telugu Flash News

Ponniyan Selvan: మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియ‌న్ భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూస్ వ‌స్తున్నాయి. కొంద‌రు చాలా భారీగా తెర‌కెక్కించారు అంటే మ‌రి కొంద‌రు మాత్రం బాహుబ‌లి స్క్రాప్‌ని తెచ్చి సినిమా చేసిన‌ట్టుంది అంటున్నారు. విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రకాశ్ రాజ్ లాంటి అగ్రతారలతో ఈ చిత్రాన్ని దృశ్య కావ్యంగా మ‌లిచారు మ‌ణిర‌త్నం . అయితే ఫ‌స్టాఫ్ ర‌క‌ర‌కాల గంద‌ర‌గోళాల మ‌ధ్య న‌డుస్తుండ‌గా, సెకండాఫ్‌లో అసలు కథ, పాత్రల మధ్య బంధాలు, వైరాలను కొంత వివరంగా చెప్పే ప్రయత్నం చేయడం కాస్త ఉపశమనం కలుగుతుంది.

ఎవరు  మిస్ చేసుకున్నారు ?

సెకండాఫ్‌లో కార్తీ, జయం రవి మధ్య సన్నివేశాలు, త్రిష, ఐశ్వర్య రాయ్ మధ్య సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇక సముద్ర కుమారి పాత్ర కూడా బాగుంటుంది. చివర్లలో ఒక మంచి ట్విస్టు ఇచ్చి పొన్నియన్ సెల్వన్ 2 పై అంచనాలు పెంచే ప్రయత్నం అయితే చేశారు.

అయితే పదేళ్ల క్రితం మణిరత్నం వేరే తారాగణంతో సినిమాను ప్రారంభించా ల‌ని అనుకున్నార‌ట‌. టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ని ఓ పాత్ర‌కి ఎంపిక చేశాడ‌ట‌. మహేష్ బాబు బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాను రిజెక్ట్ చేశారట. ఇక సినిమాలో విక్రమ్ చేసిన పాత్ర కోసం తమిళ స్టార్ విజయ్ ని అనుకున్నారట. కానీ విజయ్ కూడా ఆ స‌మ‌యంలో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారట.ఈ విష‌యాల‌ని రచయితగా పనిచేసిన జయ మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఈ విష‌యాలు వెల్లడించారు.

Ponniyan Selvan

దాంతో ఆ అవకాశం విక్రమ్, కార్తీల‌ను వరించింది. పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగం శుక్రవారం రోజున తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాగా, రెండో భాగం 10 నెలల లోపు విడుదల కానున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ మణిరత్నం వెల్లడించారు. మొదటి భాగాన్ని మణిరత్నం 150 రోజుల్లో పూర్తి చేశారు. ఈ సినిమాను మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.  ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమన్‌ సంగీతం అందించారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News