Monday, May 20, 2024
HometelanganaHarish Rao : ఆర్థిక సంఘం నిధుల సంగతి ఎందుకు మాట్లాడలేదు? జేపీ నడ్డాపై మంత్రి హరీష్‌ రావు ఫైర్‌

Harish Rao : ఆర్థిక సంఘం నిధుల సంగతి ఎందుకు మాట్లాడలేదు? జేపీ నడ్డాపై మంత్రి హరీష్‌ రావు ఫైర్‌

Telugu Flash News

బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదో విడత పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో కరీంనగర్‌ వేదికగా బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరై కేసీఆర్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో జేపీ నడ్డాకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు (Harish Rao) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గడ్డ మీదకు వచ్చి విమర్శలు చేయడం కాదు.. నిధుల సంగతి తేల్చాలని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్‌ రావు.. కేంద్రం, బీజేపీ నేతలపై ఫైర్‌ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ.5,374 కోట్ల నిధులు ఎప్పుడిస్తారని జేపీ నడ్డాను మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక సంఘం చెప్పినట్లు అమలైందని, తెలంగాణలో ఎందుకు అమలు కాలేదని నడ్డాను నిలదీశారు. తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధుల సంగతి తేల్చకుండా కేవలం కేసీఆర్‌పై విమర్శలు చేయడానికే ఇక్కడకు వస్తున్నారని మండిపడ్డారు హరీష్‌ రావు.

jp nadda comments on trs party

బోర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, ఒప్పుకోకపోవడంతో రెండున్నరేళ్లుగా సుమారు 12 వేల కోట్ల సాయం ఆపేశారని హరీష్‌ రావు ఆరోపించారు. అటు ఎఫ్‌ఆర్‌బీఎంలోనూ 15 వేల కోట్ల రూపాయల మేర కోత పెట్టారని మంత్రి తప్పుపట్టారు. నీతి ఆయోగ్‌ చెప్పిన నిధులు రూ.24 వేల కోట్లు కూడా తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం మొండి చెయ్యి చూపిందని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలకు పనికొచ్చే ఒక్క మాటైనా ఉందా?

దేశ వ్యాప్తంగా అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ 23వ స్థానంలో ఉందన్న హరీష్‌ రావు.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కోటానుకోట్ల అప్పులు చేసి దేశాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిందని ధ్వజమెత్తారు. మునుగోడులో ఓడినా బీజేపీకి బుద్ధి రాలేదని, హిమాచ్‌ల్‌ ప్రదేశ్‌ చేజారినా ఇక్కడికి వచ్చి జేపీ నడ్డా నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌ సభలో ప్రజలకు పనికొచ్చే ఒక్క మాటైనా జేపీ నడ్డా మాట్లాడారా? అని హరీష్‌ రావు ప్రశ్నించారు. తెలంగాణపై కుట్రపూరితంగా, పక్షపాతంగా వ్యవహరిస్తున్న బీజేపీని ప్రజలే బొందపెడతారని హరీష్‌రావు స్పష్టం చేశారు.

also read news: 

-Advertisement-

Bihar News: బిహార్‌లో కల్లోలం.. 71కి చేరిన కల్తీ సారా మృతులు.. నితీష్‌ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ తాఖీదులు!

Katrina kaif latest hot photo gallery 2022

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News