Hometelanganaతెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త! గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త! గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి.. ఉత్తర్వులు జారీ

Telugu Flash News

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా దాదాపు 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం (నవంబర్ 25) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్-4 ఉద్యోగాల్లో ప్రధానంగా నాలుగు కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉంటాయి.

  • మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 6,859 ఉన్నాయి.
  • ఉన్నత విద్యాశాఖలో 742,
  • బీసీ సంక్షేమంలో 307,
  • హోంశాఖలో 133,
  • పంచాయతీరాజ్‌లో 1245,
  • రెవెన్యూ శాఖలో 2,077 పోస్టులు ఉన్నాయి.

ఈ విషయమై మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. త్వరలో గ్రూప్‌-4 రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులన్నీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయబడతాయి. ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించిన నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

  • జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429
  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, (పంచాయతీ రాజ్ శాఖలో 1,245 పోస్టులు, రెవెన్యూ విభాగంలో 2,077 పోస్టులు)
  • junior ఆడిటర్ పోస్టులు 18
  • వార్డ్ ఆఫీసర్ పోస్టులు 1,862.

 

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News

Malavika Mohanan Stunning in her Latest Looks The Fashion Majesty of Sonam Kapoor Magnesium Magic : Best Food Sources for Mental Wellness 31st December 2023 Taurus Horoscope