Hometelanganaకేసీఆర్‌పై గవర్నర్‌ తమిళిసై సెటైర్లు.. అభివృద్ధి అంటే ఇది కాదంటూ..!

కేసీఆర్‌పై గవర్నర్‌ తమిళిసై సెటైర్లు.. అభివృద్ధి అంటే ఇది కాదంటూ..!

Telugu Flash News

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్‌ తమిళిసై మరోసారి ఇన్‌డైరెక్టర్‌గా సెటైర్లు వేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌ భవన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు గవర్నర్‌. అనంతరం మాట్లాడిన తమిళిసై.. ప్రజలందరికీ రిపబ్లిక్‌డే శుభాకాంక్షలు తెలిపారు.

మనకు లభించిన స్వాతంత్ర్యం ఎందరో వీరుల త్యాగఫలమని గవర్నర్‌ తెలిపారు. అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశంగా మనదేశం నిలుస్తోందన్నారు. ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా పరిఢవిల్లుతోందన్నారు. ప్రసంగం సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సెటర్లు వేయడం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో మరింత వేడి రాజేసినట్లవుతోంది.

తన ప్రసంగంలో కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణంపై కూడా గవర్నర్‌ పరోక్షంగా విమర్‌శలు చేశారు. అభివృద్ధి అంటే కేవలం కొత్త బిల్డింగులు కట్టడం కాదని చెప్పారు. ఫామ్‌హౌస్‌లు కట్టుకొని అందులో ఉండటం కాదన్నారు. మన బిడ్డలు విదేశాల్లో అభ్యసించడం అభివృద్ధి కాదని, రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో ఇంటర్నేషనల్‌ సౌకర్యాలు ఉండాలని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడదామంటూ పిలుపునిచ్చారు తమిళిసై.

కన్నెత్తి చూడని ప్రభుత్వ పెద్దలు

-Advertisement-

తెలంగాణతో తనకు పుట్టుకతోనే అనుబంధం ఉందని తమిళిసై చెప్పారు. తాను కొంతమందికి నచ్చకపోవచ్చన్న గవర్నర్‌.. తెలంగాణ ప్రజలంటే తనకు అమితమైన ఇష్టమన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అని చెప్పిన గవర్నర్‌.. ఎంత కష్టమైనా ప్రజల కోసం పని చేస్తానని వ్యాఖ్యానించారు. అంతుకు ముందు రిపబ్లిక్‌ డే వేడుకలపైనా హైడ్రామా నడిచింది. వేడుకలు రాజ్‌ భవన్‌లోనే జరగాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఈ క్రమంలో పరేడ్‌తో కూడిన గణతంత్ర వేడుకలు రాజ్‌ భవన్‌లో జరిగాయి. అయితే, ‌ప్రభుత్వ పెద్దలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

also read :

Padma Awards 2023 : కీర‌వాణికి ద‌క్కిన ప‌ద్మ అవార్డ్‌.. సింగర్ వాణి జయరామ్‌కి పద్మభూషణ్ అవార్డు

pineapple benefits : పైనాపిల్‌ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా? తెలిస్తే అస్సలు వదలరు!

BBC Documentary : మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. కేరళలో ప్రదర్శనపై పెను దుమారం!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News