Caterpillar : ములుగు జిల్లా వెంకటాపురం మండలం మర్రిగూడెంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం అసాధారణ సమస్య నెలకొంది. పాఠశాల ఆవరణ, గోడలు, చుట్టుపక్కల చెట్లు పెద్దఎత్తున గొంగళి పురుగులతో నిండిపోయాయి. దీంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థుల్లో తీవ్ర అసౌకర్యం నెలకొంది. చివరకు దిక్కుతోచని పరిస్థితిలో ఉపాధ్యాయులు పాఠశాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. గొంగళి పురుగు ఉధృతితో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో అయోమయం, భయాందోళనలు నెలకొన్నాయి.
పాఠశాల ఆవరణలోని చెట్లు, భవనాలపై ఎక్కడ చూసినా గొంగళి పురుగులు కనిపిస్తున్నాయి. ఈ కీటకాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పైన పడడం తో వారి చర్మంపై దద్దుర్లు, దురద మరియు మంట కలుగుతున్నాయని వాపోతున్నారు. దీంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఈ గొంగళి పురుగు సమస్యను పరిష్కరించడానికి మరియు తదుపరి అసౌకర్యాన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
పాఠశాల చుట్టూ ఉన్న చెట్లు, భవనాల చుట్టూ గొంగళి పురుగులు ఉండడంతో ఉపాధ్యాయులు, అధికారులు అయోమయానికి గురవుతున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న మరియు పెరుగుతున్న చర్మ సంబంధిత సమస్యలు పరిస్థితిని సంబందిత అధికారులకు వివరించారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పాఠశాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
also read :
సమంత షాకింగ్ నిర్ణయం.. ఆ కారణంగా సినిమాలకు విరామం..!
today weather report 5.7.2023 : తేలికపాటి నుంచి భారీ వర్షాలు