నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కంటి నిండా నిద్రపోవడం చాలా మందికి కష్టంగా మారుతోంది. పనిఒత్తిడి, తీసుకొనే ఆహారంలో మార్పులు జరగడం వల్ల వేళకు నిద్రపోలేకపోతుంటారు. రాత్రిపూట బెడ్ మీదకు వెళ్లినా నిద్ర రాక సెల్‌ఫోన్ చూసుకుంటూ చాలా సమయం గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చూస్తుండగానే అర్ధరాత్రి అయిపోతుంది. ఉదయం అరకొర నిద్రతోనే లేచి పనులకు వెళ్లిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో సుఖమైన నిద్ర రావడానికి కొన్ని టిప్స్ (good sleep tips) పాటించాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రపోవాలంటే మొదట ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే హాయిగా నిద్ర పడుతుంది. గదిలోని వాతావరణం, వెలుతురు, సౌండ్, వస్తువులు పెట్టుకోవడం లాంటివి నిద్రపై ప్రభావం చూపుతాయి. బెడ్‌పై ఎప్పటికప్పుడు దుప్పటి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నిద్రపోయే ముందు వీలైనంత వరకు శబ్దాలు లేకుండా చూసుకుంటే కాస్త డీప్ స్లీప్‌కు అవకాశం ఉంటుంది.
వ్యాయామం చేస్తే మంచి నిద్రకు అవకాశం..
వీలైనంత వరకు రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన శరీరం ఆటోమేటిక్‌గా నిద్రను అలవాటు చేసుకుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ, టీ లాంటి వాటిని అవాయిడ్ చేయాలి. వీటిలోని కెఫైన్ వల్ల నిద్ర రాకుండా చేస్తాయని అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. ఇక రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం వల్ల కూడా నిద్ర బాగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
also read news: