Gold Rates Today ((26-04-2023) : పసిడి వాడి తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకూ బంగారం ధర పెరిగిపోతోంది. అక్షయ తృతీయ వెళ్లిపోయినా బంగారం కొనుగోలుదారుల తాకిడి అస్సలు తగ్గడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర రూ.61 వేలు దాటిపోయింది. దీంతో బంగారం ప్రియులు, వివాహాది శుభకార్యాలకు కొనుగోలు చేసేవారు గగ్గోలు పెడుతున్నారు.
ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర రూ.200, 24 క్యారెట్ల పసిడి రూ.220 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర రూ. 300 ఎగబాకింది.
తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,930 గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,700గా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇదే ధర అమల్లో ఉంటుంది.
ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,930గా నమోదైంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.56,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,420కి చేరింది.
ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,930కి చేరింది. సంపన్నులైన వారు ఇంట్రస్ట్‌గా కొనే విలువైన లోహం ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.430 తగ్గింది. రూ.28,600కు చేరింది.
also read :
Weather Today : తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు కురిసే ప్రాంతాలివే.. ఈ రోజు వాతావరణం.. (26-04-2023)
Gopichand: గోపిచంద్‌తో గొడవకు దిగిన తేజ.. నువ్వు ఏం పీకావ్ అంటూ ఫైర్