ఇటీవలే కాలంలో ప్రతిచోట వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ఎలోన్ మస్క్ (Elon Musk) .స్పేస్ ఎక్స్,టెస్లా,న్యూరాలింక్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద కంపనీలకు అధిపతి అయిన ఎలోన్ మస్క్ ప్రతి సారి ఏదో ఒక రకంగా న్యూస్లో హెడ్ లైన్స్ అయ్యి ఉంటాడన్న విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ ఏడాది ఏప్రిల్ 14న ఎలోన్ ట్విట్టర్ ని భారీ మొత్తంతో సొంతం చేసుకున్న తరువాత ఆయన హెడ్ లైన్స్ లో ఉండడం మరింత ఎక్కువైంది.
అసలు విషయానికి వస్తే ఎలోన్ మస్క్ ట్విట్టర్ ని కొనక ముందు నుంచే ట్విట్టర్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వాడు. ఫ్రీ స్పీచ్ అంటూ అందరికీ వారి వారి అభిప్రాయాలను వెల్లడించే అవకాశం,స్వేచ్ఛ ఉండాలని ఎప్పుడూ ట్విట్టర్ వేదికగా చెబుతుండేవాడు.
ఆ విధంగానే తాను ట్విట్టర్ ని సొంతం చేసుకున్నాక ఇంతక ముందు ట్విట్టర్ వేదిక నుంచి బాన్ చేసిన డోనాల్డ్ ట్రంప్ లాంటి వారి అకౌంట్లను మళ్ళీ తిరిగి ట్విట్టర్ పైకి తీసుకువచ్చాడు.
అయితే మొదటి నుంచి ఫ్రీ స్పీచ్ అంటూ వచ్చిన ఎలోన్ మస్క్ ఇప్పుడు కొత్తగా కొంతమంది రిపోటర్ల అకౌంట్లను ట్విట్టర్ నుంచి బాన్ చేయడంతో అది అంతటా సంచలనంగా మారింది.
ఎలోన్ ఒక నెల ముందే ఫ్రీ స్పీచ్ అని చెప్పి ఇలా చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుండగా అలా బాన్ అయ్యిన అకౌంట్ లలో న్యూ యార్క్ టైమ్సకు(New York times) చెందిన ర్యాన్ మాక్, సి.ఎన్.ఎన్(C.N.N) డోన్నీ సల్లివన్, మాషబ్ల్ కు చెందిన (mashable) మాట్ బైండర్ లాంటి వాళ్ళ అకౌంట్లు కూడా ఉండడం విశేషం.
ఇలా అకౌంట్లను బాన్ చేయడంపై న్యూ యార్క్ టైమ్స్ ప్రతినిధి మాట్లాడుతూ ర్యాన్ మాక్ ను బాన్ చేయబోతున్నారన్న విషయం తమకు ముందుగా తెలియచేయలేదని,ఈ విషయంపై తమకు సరైన వివరణ ఇవ్వాలని కోరారు.
ఈ బాన్ గందర గోళంపై ఎలోన్ స్పందిస్తూ తనకు,తన కుటుంబానికి కొంత మంది కావాలని హాని చేయడానికి చూస్తున్నారని, ఇక మీదట ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే జర్నలిస్ట్ లకు వర్తించిన నియమమే వారికీ వర్తిస్తుందని ట్వీట్ చేసాడు.
అయితే ఇటీవలే కొంత మంది ఎలోన్ మస్క్ ప్రైవేట్ జెట్ ను ట్రాక్ చేస్తూ అతని కదలికలను ప్రతి క్షణం ట్విట్టర్లో పోస్ట్ చేస్తుండడంతో ఎలోన్ ఇలా కొంత మంది అకౌంట్లను బాన్ చేశాడని తెలుస్తుంది.ఈ బాన్ ఎక్కడ వరకు వెళ్తుందో, ఎలోన్ పోనూ పోనూ ట్విట్టర్ నుంచి ఇంకెంత మందిని నిషేదిస్తాడో చూడాలి మరి…
also read news:
YS Jagan: జగన్ చేతిలో ఆ ఎమ్మెల్యేల జాతకం.. 20 మందికి పైగా మార్పు ఖాయమా?