ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, గత చంద్రబాబు ప్రభుత్వంలో లంచాలు ఇస్తేనే ప్రజలకు పని జరిగేదని విమర్శించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి ఎన్నో హామీలు ఇచ్చారని, పేద వారికి 3 సెంట్ల భూమి ఇస్తామని, అందులో ఒక్క సెంటు కూడా అమలు చేయలేదని ఆరోపించారు.
చంద్రబాబు అవినీతిపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదని జగన్ ప్రశ్నించారు. బాబు అవినీతిలో పవన్ కు భాగస్వామ్యం ఉండబట్టే ఆయన ప్రశ్నించలేదని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని ఏబీఎన్, ఈటీవీ, టీవీ5 చూపించలేదని విమర్శించారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకు వెళ్లి పరామర్శించిన ఘనత పవన్ ది అని జగన్ అన్నారు.
రాబోయే రోజుల్లో రాజకీయ కుట్రలకు తెరతీస్తారని జగన్ చెప్పారు. పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారని ఆయన అన్నారు. వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం తనకు రాదని జగన్ అన్నారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు.