Sunday, May 12, 2024
HomecinemaDeepika Padukone : బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొనే సినీ ప్రయాణం, సక్సెస్ స్టోరీ

Deepika Padukone : బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొనే సినీ ప్రయాణం, సక్సెస్ స్టోరీ

Telugu Flash News

తన నటనతో ప్రేక్షకులను అలరించగల నటి ,బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొనే (Deepika Padukone) .అలాంటి వ్యక్తి,నటి అయిన దీపికా గురించి అందరూ తెలుసుకోవాలి,అందరికీ తెలియాలి.

1986,జనవరి 5న డెన్మార్క్ లోని కోపెన్‌హాగన్ లో ఒక మామూలు బ్రాహ్మణ కుటుంబంలో వృత్తి రిత్యా బాట్మింటన్ ఆటగాడు అయిన ప్రకాశ్‌ పదుకొనే,ఉజ్జల పదుకొనే లకు దీపికా పదుకొనే జన్మించింది.

దీపికాకు ఏడాది వయసున్నప్పుడే ప్రకాష్ పదుకొనే తన కుటుంబంతో బెంగళూర్ కి వలస వచ్చేయడంతో దీపికా తన ప్రాథమిక విద్యనంతా బెంగళూర్లోనే పూర్తి చేయగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీలో చేరింది.

అయితే అప్పటికే మోడలింగ్ చేస్తున్న దీపికకు అదే సమయంలో కాలేజ్ కి కూడా వెళ్ళడానికి సమయం సరిపోక పోతుండడంతో తన చదువును మధ్యలోనే ఆపేసింది.

తన తండ్రి ఒక బాట్మింటన్ ఆటగాడు కావడంతో చిన్నప్పటి నుండి బాట్మింటన్ పై ఎక్కువ ఆసక్తితో ఆడుతూ వచ్చిన దీపిక తను కూడా ఒక బాట్మింటన్ ప్లేయర్ అవ్వాలని నిర్ణయించుకుంది.

కానీ కొంత కాలానికి ఆ ఆట తనకెందుకో ఇష్టం లేకుండా అడుతున్నానని అనిపించడంతో ఇక బాట్మింటన్ ఆడనని ఇంట్లో చెప్పేసిన దీపికా 2004 తన శ్రద్ధనంతా మోడలింగ్ పై ఉంచి ఆ దిశగా అడుగులు వేసింది.

-Advertisement-

అలా పూర్తి సమయం మోడలింగ్ కే పరిమితం చేసిన దీపికా లిరిల్,లాక్మే లాంటి పెద్ద పెద్ద బ్రాండ్ల యాడ్లలో నటించి తొలి సారిగా టీవీలో కనిపించింది.ఆ తరువాత హిమేష్ రేషమ్మియా “నామ్ హై తేర” విడియో సాంగ్లో కనిపించి తనకంటూ పేరు సంపాదించుకుంది.

సినీ ప్రయాణం:

2006లో తెలుగు సినిమా మన్మధుడుకి రీమేక్ గా ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమాతో తొలి సారిగా సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగు పెట్టిన దీపికా తొలి రోజులలో హావబావాలను పలింకించడంలో విఫలమైందని విమర్శలు ఎదురుకొన్నప్పటికీ ఆ తరువాత విడుదలైన ఫరా ఖాన్ “ఓం శాంతి ఓం” సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని వారి మనసులలో ఒక ప్రత్యేకమైన స్ధానాన్ని దక్కించుకుంది.

అప్పట్నుంచి ప్రతి సినిమాలో విభిన్నమైన పాత్రతో, తనదైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసిన దీపికా హౌస్ ఫుల్,లవ్ ఆజ్ కల్,రేస్ 2,రామ్ లీలా,ఏ జవానీ హై దీవాని,చెన్నై ఎక్స్ ప్రెస్,బాజీ రావ్ మస్తాని,తమాషా, చపాక్ లాంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను మైమరపించింది.

అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందడంతో పాటు బాలీవుడ్ హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన ప్రత్యేకమైన సినిమాలలో తన అబ్బురపరిచే నటనతో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు,మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టైమ్స్ పత్రిక ద్వారా “one of the 100 most influential people in the world” అని పేరుపొందిన దీపికా 2018లో మోస్ట్ ఎనర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్ ని వివాహమాడి తన సినీ జీవితంతో పాటు వ్యక్తి గత జీవితాన్ని కూడా ఆనందంగా గడుపుతుంది.

deepika padukone and ranveer singh
deepika padukone and ranveer singh

ఇక ముందు ఇంకెన్ని అద్బుతాలు సృష్టిస్తుందో,ఇంకెన్ని రివార్డులు అందుకుంటుందో చూడాలి మరి.

also read news:

good sleep tips : సుఖమైన నిద్ర కోసం ఇలా చేయండి.. బెస్ట్‌ టిప్స్‌ ఇవే! 

Chandra Babu at Khammam: ఖమ్మంలో టీడీపీ అధినేత పర్యటన.. మళ్లీ టీడీపీ పుంజుకుంటుందా? చంద్రబాబు వ్యూహమేంటి? 

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News