CBI Ex Director Nageswararao comments : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు కేటాయించిన రిజర్వేషన్లను రద్దు చేసేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై రాష్ట్రంలో రాజకీయ కాక రేగింది. చేవెళ్ల బహిరంగ సభలో అమిత్ షా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
తాజాగా దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన ముస్లిం మైనార్టీలను చేరదీయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కోరికకు భిన్నంగా అమిత్ షా వ్యాఖ్యలున్నాయని అభ్యంతరం తెలిపారు. అయితే, బీజేపీ, మస్లిజ్ పార్టీలపై సీబీఐ మాజీ డైరెక్టర్ మండిపడ్డారు.
ఆ రెండు పార్టీలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాయంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఆరోపించారు. అలాంటి హామీలపై తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా మసలుకోవాలని హెచ్చరించారు. బీజేపీ, మజ్లిస్ పార్టీల మతతత్వ పోకడలను, ప్రచారాన్ని నమ్మి మోసపోకండని సూచించారు.
ప్రజల్లో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించడం శోచనీయమన్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హిందువులను మోసగించినట్లే తెలంగాణలోనూ హిందువులను బీజేపీ మోసం చేయడాని సిద్ధమవుతోందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
తొమ్మిదేళ్లలో దేశంలోని అన్ని పార్టీలూ సిగ్గుపడేలా మైనార్టీల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన బీజేపీని చూడాలంటూ ఆయన సెటైర్లు వేశారు. హిందుత్వం పేరు చెప్పుకుంటున్న బీజేపీ.. హిందువుల కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా ఒక్క రూపాయి అయినా కేటాయించిందా? అని ప్రశ్నించారు.
హిందువుల కోసం ఒక్క పథకమైనా ప్రత్యేకంగా ప్రవేశపెట్టలేదేమని అడిగారు. ఇదేనా హిందువులపై నిజమైన ప్రేమ అని నిలదీశారు. మరోవైపు ముస్లింలను ఉద్ధరించేది తామేనంటూ ఎంఐఎం చెప్పుకుంటోందని, ఈ విషయంలో బీజేపీ, ఎంఐఎం దొందూ దొందేనన్నారు.
సీబీఐ మాజీ డైరెక్టర్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. బీజేపీ, మజ్లిస్ పార్టీలపై విమర్శలు చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన ఏం ఆశించిన ఈ ట్వీట్లు చేశారో చెప్పాలని బీజేపీ, మజ్లిస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అధికార పార్టీలో చేరుతారా? లేక మరే ఇతర పార్టీ అయినా చూసుకున్నారా? రాజకీయ కాంక్ష ఉందా? పదవీ కాంక్షతోనా? ఏం ఆశించి ఇలా మాట్లాడుతున్నారో తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. నేరుగా పార్టీలో చేరి రాజకీయం చేయాలని, మాజీ అధికారి ట్యాగ్ లైన్ అడ్డం పెట్టుకొని ఇలా మాట్లాడటం సరికాదంటున్నారు.
APPEAL to Hindus of Telangana:
Do not to be fooled by the communal rhetoric of BJP & Majlis (AIMIM). They both feed each other by exciting people on communal lines.
They are out to cheat Hindus of Telangana as may be seen in all the States ruled by BJP and the Centre.
See👇the… pic.twitter.com/H7OFwWESRQ
— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) April 24, 2023
also read :
Viral Video : చీరల కోసం సిగపట్లు.. జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్న మహిళలు!
Gold Rates Today (25-04-2023) : నేటి బంగారం,వెండి ధరలు ఇలా..