Monday, May 13, 2024
HomeinternationalBernad Arnault : లక్షల కోట్ల సంపదకు వారసుడెవరు? ప్రపంచ కుబేరుడి వెతుకులాట

Bernad Arnault : లక్షల కోట్ల సంపదకు వారసుడెవరు? ప్రపంచ కుబేరుడి వెతుకులాట

Telugu Flash News

Bernad Arnault : ఆయన ప్రపంచ కుబేరుల్లో నంబర్‌ వన్‌ పొజిషన్‌లో ఉన్నారు. 74 సంవత్సరాల వయసులోనూ అత్యంత చలాకీగా వ్యవహరిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని టాప్‌లో నిలబెట్టారు. మరి లక్షల కోట్ల సంపదకు వారుసుడిని ఎంపిక చేయాల్సిన తరుణం ఆసన్నమైంది.

తన తర్వాత ఐదుగురిలో ఒకరిని వారసుడిగా ఎన్నుకోవాల్సి ఉంది. దీంతో ఆ ఒక్కరు ఎవరా? అనే అంశంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార దిగ్గజాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. నిజానికి వారసుడి విషయంలో ఆయన చాన్నాళ్ల కిందటే కసరత్తు మొదలు పెట్టారట.

వారసుడు ఎవరనే అంశంపై పదేళ్ల కిందటే కసరత్తు ప్రారంభించిన ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నాడ్‌ ఆర్నాల్డ్‌.. ప్రస్తుతం వారసుడిని ఎన్నుకుంటున్నారు. ఆయన లూయీ విటన్‌ మోయెట్‌ హెన్నెస్సీ (LVMH) పేరుతో వరల్డ్‌ వైడ్‌గా లగ్జరీ బ్రాండ్‌ బిజినెస్‌లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

ఇకపోతే ఆయన లక్షల కోట్ల సంపదను తదుపరి చూసుకోవడానికి, వ్యాపారం పది కాలాల పాటు నిలబడేందుకు వారసుడిని ఎన్నుకోవడంలో భాగంగా యన అనుసరించే విధానం ఆసక్తికరంగా మారింది.

బెర్నాడ్‌ వ్యాపార సంస్థలను తన తర్వాత సమర్థంగా నిర్వహించే వారసుడి కోసం ఆయన నెలకోసారి పారిస్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో తన ఐదుగురు పిల్లలతో కలిసి గంటన్నరపాటు భోజనం చేస్తారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Bernad Arnault family
Bernad Arnault family

వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఇటీవల ఓ కథనం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ లంచ్‌ బ్రేక్‌లో ఆయన సంస్థకు సంబంధించిన తన ఐపాడ్‌లో నోట్ చేసుకున్న పలు విషయాలను చదివి, వాటిపై పిల్లల సూచనలు కోరతారని ద వాల్‌ స్ట్రీట్‌ తెలిపింది. ఇలా పదేళ్లుగా ఆయన కొనసాగిస్తున్నారట.

-Advertisement-

ఇలా చేయడం వల్ల కంపెనీ తీసుకొనే నిర్ణయాలు, అనుసరించే వ్యూహాలు, బిజినెస్‌ ఎక్స్‌పాండ్‌ గురించి వారసులకు అవగాహన కల్పించడం, తన తర్వాత వారసుడిని ఎంపిక చేయడం సులువవుతుందని బెర్నాడ్‌ వ్యూహం వేశారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది.

దాంతోపాటు ఐదుగురు పిల్లల్లో ఎవరెవరికి ఎలాంటి ప్రతిభ ఉంది? ఎవరి సామర్థ్యం ఎంత అనేది ఈజీగా తెలుసుకోగలుగుతున్నారని పేర్కొంది. బెర్నాడ్‌ ఇప్పటికే తన పిల్లలకు కీలక బాధ్యతలు అప్పగించారు. అందరికంటే పెద్ద కుమార్తె డెల్‌ ఫైన్‌కు ఫ్యాషన్‌ రంగంలో రెండో అతి పెద్ద బ్రాండ్‌ క్రిస్టియన్‌ డైర్‌ బాధ్యతలు ఇచ్చారు.

పెద్ద కుమారుడు ఆంటోనికి ఎల్‌వీఎంహెచ్‌ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఇలా అందరికీ తలో బాధ్యత ఇచ్చారు. అసలైన వారసుడిని ప్రకటించేందుకు మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది.

also read :

Viral Video : చీరల కోసం సిగపట్లు.. జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్న మహిళలు!

Gold Rates Today (25-04-2023) : నేటి బంగారం,వెండి ధరలు ఇలా..

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News