Homebigg boss telugu season 6bigg boss telugu season 6 : బిగ్ బాస్ శ్రీస‌త్య‌పై పెరుగుతున్న నెగెటివిటీ.. అందంతో కాదు ఆట‌తో మెప్పించు..!

bigg boss telugu season 6 : బిగ్ బాస్ శ్రీస‌త్య‌పై పెరుగుతున్న నెగెటివిటీ.. అందంతో కాదు ఆట‌తో మెప్పించు..!

Telugu Flash News

bigg boss telugu season 6: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం తెలుగులో సీజ‌న్ 6 జ‌రుపుకుంటుంది. ఇందులో 21 మంది కంటెస్టెంట్స్ షోలోకి అడుగుపెట్ట‌గా వారిలో ఒక్కొక్క‌రు ఒక్కో స్టైల్‌లో గేమ్ ఆడ‌డం మొద‌లు పెట్టారు.

శ్రీ స‌త్య విష‌యానికి వ‌స్తే ఆమె తిండిబోతు అనే విష‌యాన్ని స్టేజ్ మీదే చెప్పేసింది. అయితే షో మొద‌లై ఇప్ప‌టికీ రెండు వారాలు అయిన ఇప్ప‌టికీ త‌న అందం, మాట‌ల‌తోనే నెట్టుకొస్తుంది త‌ప్ప గేమ్ అనేది ఆడ‌డం లేదు. పొట్టి బట్టల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది.

ట్రోలింగ్ బారిన శ్రీ స‌త్య‌..

హౌస్ ‌లోపలికి వెళ్లే ముందే శ్రీ స‌త్య‌ పీ ఆర్ టీమ్స్ ‌ని కూడా బాగానే సెట్ చేసుకుని లోపలికి వెళ్లినట్లుంది. దాంతో నెట్టింట పీ ఆర్ టీమ్స్ రచ్చ బాగానే చేస్తుంది కాని ఎలాంటి ప‌ర్‌ఫార్మెన్స్ చేయ‌పోయే స‌రికి ఆమెను తెగ ట్రోల్స్ చేస్తున్నారు. గేమ్ ఆడ‌క‌పోగా, ప‌క్క‌నోళ్ల‌కి స‌లహాలు ఇస్తుంది.దీంతో శ్రీ స‌త్య‌ని ఆడుకుంటున్నారు.

కెప్టెన్ ఎవ‌రైతే బాగుంటుంద‌నే విష‌యంలో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్పుడు కూడా శ్రీ స‌త్య ఏవేవో స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తుంది. దీంతో శ్రీ స‌త్య ట్రోలింగ్‌కి గుర‌వుతుంది. అయితే అంత‌క‌ముందు ఎపిసోడ్‌లో తాను సూసైడ్ చేసుకున్న విష‌యం చెప్పి సింప‌థీ క్రియేట్ చేసుకుంది.

ఇక బిగ్ బాస్ హౌజ్‌లో ల‌వ్ ట్రాక్‌లు కామ‌న్. సీజన్ సిక్స్ లో కొత్త కెప్టెన్ రాజ్ .. తోటి కంటెస్టెంట్ శ్రీ సత్యకి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇదంతా సీరియస్ గా కాదు. బిగ్ బాస్ హౌస్ లో శుక్రవారం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి త‌మ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం రావడం జ‌రిగింది.

ఈ సందర్భంగా సుధీర్ బాబు .. కంటెస్టెంట్లకు కొన్ని టాస్కులు ఇచ్చారు. దీంతో ఎవరికి వారు తమ టాలెంట్ టాస్క్ రూపంలో చూపించారు. రాజ్‌.. శ్రీస‌త్య‌కి ప్ర‌పోజ్ చేసి అద‌ర‌హో అనిపించాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News