Homeviral newsViral Video: జుట్టు ప‌ట్టుకొని న‌డి రోడ్డుపై కొట్టుకున్న ఇద్ద‌రు మ‌హిళ‌లు..క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్న పురుషులు

Viral Video: జుట్టు ప‌ట్టుకొని న‌డి రోడ్డుపై కొట్టుకున్న ఇద్ద‌రు మ‌హిళ‌లు..క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్న పురుషులు

Telugu Flash News

Viral Video: నీళ్ల పంపు ద‌గ్గ‌ర లేదంటే రేష‌న్ పాపుల ద‌గ్గ‌ర మహిళ‌ల గొడ‌వలు ఎక్కువ‌గా చూస్తుంటాం. కొంద‌రు మాట‌ల దాడులు చేసుకుంటుండ‌గా, మరి కొంద‌రు దారుణంగా కొట్లాడుకోవ‌డం కూడా మ‌నం చూస్తుంటాం.

అయితే రీసెంట్‌గా ఓ టోల్ ప్లాజా ద‌గ్గర ఇద్ద‌రు మ‌హిళ‌లు జ‌ట్టు ప‌ట్టుకొని మరీ కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వివరాల‌లోకి వెళితే నాసిక్‌లోని పింపాల్‌గావ్ టోల్ ప్లాజా వ‌ద్ద ఇద్ద‌రు మ‌హిళ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ చోటు చేసుకుంది. వీరిలో ఒకరు టోల్ ప్లాజా ఉద్యోగి కాగా, మరొకరు ప్ర‌యాణికురాలు అని తెలుస్తుంది.

ఇద్దరి మ‌ధ్య గొడ‌వ‌..

ఇద్దరూ ఒకరి జుట్టును ఒకరు లాగుతూ.. ఒకరినొకరు చాలాసార్లు కొట్టుకోవడం వీడియోలో కనిపించింది. ఒకరినొకరు పదే పదే కొట్టుకోవడం, దుర్భాషలాడుకోవడం, చెప్పుతో కొట్టుకోవడం వంటి దృశ్యాలు కూడా వీడియాలో క‌నిపించాయి. వారిలో ఒకరు మరాఠీలో చీరను చింపివేస్తానని బెదిరించడం కూడా వినబడింది.

చాలా సేపు అక్కడున్న వారు వీరిద్ద‌రు మ‌ధ్య జ‌రుగుతున్న‌ ఈ ఫైటింగ్ చూస్తున్నారు. సెల్ ఫోన్స్ లో చిత్రీక‌రిస్తున్నారే త‌ప్ప ఎవ‌రు ఆప‌డం లేదు. వీడియో చివర్లో, అక్క‌డున్న వారు జోక్యం చేసుకుని మహిళలను దూరం చేయడం కనిపిస్తుంది.

టోల్‌ రుసుముపై అనుమానంతో ఈ ఘటన జరిగిన‌ట్టు తెలుస్తుంది.. మొద‌ట వాగ్వాదంతో మొద‌లై.. చివ‌ర‌కు జుట్టుప‌ట్టుకుని కొట్టుకునే వ‌ర‌కు వెళ్లిందని అక్క‌డున్న వారు తెలిపారు. బుధవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

ఇక ఈ వీడియోపై ప‌లువురు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మ‌హిళ‌ల ప‌రువు తీసారు అని కొంద‌రు కామెంట్ చేయ‌గా, మ‌రి కొంద‌రు వారి ప్ర‌వ‌ర్త‌న‌పై దారుణాతి దారుణంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

-Advertisement-

 

మరిన్ని వార్తలు చదవండి 

Viral Video: వీడు మాములోడు కాదు..బైక్‌పై తీసుకెళుతూ ప్రియురాలిని నీళ్ల‌లో ప‌డేసిన ప్రియుడు

Viral Video: తల్లిని మేక‌ప్ తీయోద్దంటూ తెగ ఏడ్చేసిన చిన్నారి..!

Viral Video: అన్నం పెట్ట‌కుండా అమ్మ కొడుతుందంటూ పోలీస్ కంప్లైంట్ చేసిన 8 ఏళ్ల బుడ‌త‌డు..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News