HometelanganaTSPSC Paper Leak : పేపర్ లీకేజీ ఘటనలో నిందితురాలి బ్యాగ్రౌండ్‌ తెలిస్తే షాకవుతారు!

TSPSC Paper Leak : పేపర్ లీకేజీ ఘటనలో నిందితురాలి బ్యాగ్రౌండ్‌ తెలిస్తే షాకవుతారు!

Telugu Flash News

సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ (TSPSC Paper Leak) ఘటనలో ప్రధాన నిందితురాలు రేణుక వ్యవహారంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏపీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాథోడ్‌ రేణుక తల్లి లక్ష్మీబాయి మన్సూర్‌పల్లి అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌ కావడంతో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి.

అధికార బలం కలిసి రావడంతో లీకేజీలో రేణుక ఆ స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గురుకుల ఉపాధ్యాయురాలిగా తనకు, టెక్నికల్‌ అసిస్టెంట్‌గా తన భర్త ఢాక్యా నాయక్‌కు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాల్ని వాడుకున్నట్లు తెలుస్తోంది.

మహబూబ్‌నగర్‌ జిల్లా గంఢీడ్‌ మండలానికి చెందిన రేణుక.. వనపర్తి ఎస్సీ గురుకుల విద్యాలయంలో హిందీ పండిట్‌గా పని చేసింది. ఆమె భర్త వికారాబాద్‌ జిల్లా పరిగిలోని డీఆర్‌డీఏలో పని చేస్తున్నాడు. రేణుక సోదరుడు రాజేశ్‌ నాయక్‌తో పాటు మన్సూర్‌పల్లి తండాకు చెందిన నీలేష్‌, శ్రీను, లగిచర్లకు చెందిన గోపాల్‌ తదితరులకు క్వశ్చన్‌ పేపర్‌ ఇప్పిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. క్వశ్చన్‌ పేపర్‌ కోసం తన భర్త సాయంతో టీఎస్‌పీఎస్సీలో పని చేసే ప్రవీణ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

ఇక ఢాక్యా నాయక్‌, రేణుక దంపతులకు రాజకీయంగానూ, అధికార వర్గాల్లో కూడా పలుకుబడి, సత్సంబంధాలు ఉండటంతో వారిని నమ్మి అభ్యర్థులు భారీగా నగదు ముట్టజెప్పారట. ఒక్కొక్కరు సుమారు పది లక్షల రూపాయల వరకు సమర్పించుకున్నారని తెలుస్తోంది.

తన సోదరుడి ద్వారా మిగిలిన ముగ్గురిని రేణుక సంప్రదించిందని వారు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన కుమారుడు ఇంజనీరింగ్‌ చదివి, మహారాష్ట్రలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడని, తమ బంధువుల అమ్మాయి కావడంతో రేణుకకు డబ్బులిచ్చి ఉంటారని నీలేష్‌ తండ్రి లోక్యా నాయక్‌ చెబుతున్నారు. తన కొడుకు మోసపోయాడంటూ ఆయన కన్నీటిపర్యంతమవుతున్నారు.

రేణుక వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వసూళ్లు ఈ ముగ్గురితో ఆగిపోయాయని అనుకోవడం లేదని, మొత్తం కూపీలాగే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు రేణుక దంపతుల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అంశంపైనా దర్యాప్తు జరుపుతున్నారు.

-Advertisement-

రేణుక గవర్నమెంట్‌ టీచర్‌గా చేరాక ఆమె నియామక పత్రంలో పేరులో ఒక అక్షరం పొరపాటుగా పడిందని, దాన్ని సరిచేసుకోవడానికి ఆమె టీఎస్‌పీఎస్సీని సంప్రదించిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనేకసార్లు హైదరాబాద్‌ కార్యాలయానికి వచ్చిందని, ప్రవీణ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడ్డాక ఈ అక్రమానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సుమారు 60 మంది మహిళలతో ప్రవీణ్‌ కాంటాక్ట్‌లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

also read : 

Chiranjeevi: ఎంత గొప్ప మ‌న‌సు.. త‌మిళ విల‌న్ ఆరోగ్యం కోసం రూ.45ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన చిరంజీవి

Ananya Panday: పెళ్లిలో సీక్రెట్‌గా సిగ‌రెట్ తాగుతూ దొరికిన అన‌న్య‌

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News