Andhra Pradesh News : హైదరాబాద్‌లో అప్సర అనే మహిళను పూజారి హత్య చేసిన ఘటన మరిచిపోకముందే నెల్లూరులో ఓ పాస్టర్ దారుణమైన పని చేశాడు. చర్చిలో ప్రార్థన చేసేందుకు వచ్చిన వివాహితపై పాస్టర్ అత్యాచారం చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధితురాలికి రూ.40 వేలు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాలివి. నెల్లూరు జిల్లా ఇండోకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామానికి చెందిన ఓ వివాహిత నిత్యం ప్రార్థనలు చేసేందుకు చర్చికి వెళ్లేది. ఈ క్రమంలోనే ఆమెకు పాస్టర్ తో పరిచయం ఏర్పడింది. కానీ బిడ్డలా చూసుకోవాల్సిన మహిళపై పాస్టర్ కన్ను పడింది. ఎలాగైనా ఆమెను అనుభవించాలనే కోరికతో అది అయ్యే వరకు ఎదురుచూశాడు.
ఇటీవల ఆ మహిళ ప్రార్థన చేసేందుకు ఒంటరిగా చర్చికి రావడంతో పాస్టర్ ఇదే సరైన సమయమని భావించాడు. చిన్న పని ఉందని చెప్పి వివాహితను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించింది కానీ బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
బాధిత మహిళ చర్చి పాస్టర్ బెదిరింపులకు భయపడకుండా తనపై జరిగిన హింసను భర్తకు, కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పాస్టర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాస్టర్ అధికార పార్టీకి చెందిన ఓ నేతతో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఫిర్యాదు ఉపసంహరించుకుంటే రూ.40వేలు ఇచ్చేందుకు పాస్టర్ సిద్ధంగా ఉన్నారని బాధిత కుటుంబానికి నచ్చజెప్పేందుకు సదరు నాయకుడు ప్రయత్నించాడు. అయితే వారు అంగీకరించకపోవడంతో వారిని బెదిరించాడు.
పోలీసులు కూడా పాస్టర్ తో రాజీ కుదుర్చుకోవాలని చెబుతున్నారని బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ ఆడబిడ్డపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని… వెనక్కి తగ్గేది లేదని బాధిత మహిళ కుటుంబ సభ్యులు తెలిపారు.
read more news :
Apsara Murder Case : అదిరిపోయే ట్విస్ట్.. అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
Apsara Murder Case: అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ ?