HomegalleryAnasuya : భర్తతో అమెరికా వెకేషన్‌.. పిక్స్ వైరల్‌

Anasuya : భర్తతో అమెరికా వెకేషన్‌.. పిక్స్ వైరల్‌

Telugu Flash News

Anasuya Latest HOT and Stylish Photos with Family in USA

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనసూయ తన అందచందాలతో, చమత్కారమైన మాటలతో తెలుగు ప్రేక్షకులను ఇన్నాళ్లు అలరిస్తూనే ఉంది. తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను చాటిన అతికొద్ది మందిలో ఈ భామ ఒకరు. ఇదిలావుంటే, తాజాగా అమెరికా వెళ్లిన ఈ హాట్ యాంకర్.. అక్కడి నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.

అనసూయ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల విమానం అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాకి దర్శకత్వం శివ ప్రసాద్ యానాల మరియు నిర్మాత కిరణ్ కొర్రపాటి నిర్మించారు. అయితే ఈ సినిమాలో అనసూయ సుమతి అనే వేశ్య పాత్రలో నటించింది. ఈ సినిమాలో చిన్న పాత్రలో ఓ వైపు గ్లామర్ షో చేస్తూనే మరోవైపు ఇంటిమేట్ సీన్స్ లో అదరగొట్టింది.

అనసూయ తన భర్తతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అనసూయతో చాలు.. బికినీ ఫొటోలు ఆపండి అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. ఈ వయసులో కూడా ఇంత ఫిట్‌గా ఉండటం మాములుగా లేదు అంటూ కొందరు… ఏది ఏమైనా మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

యాంకర్ అనసూయ ఇటీవల తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లింది. అందులో భాగంగానే ఓ చోట గుర్రాలతో అనసూయ సమయం గడిపింది. ఈ సందర్భంగా తన పోస్ట్ లో.. వాటితో మాట్లాడడం.. వాటితో గడపడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నాన్న గుర్తొచ్చారు. జంతువులలో గుర్రాలు అత్యంత విశ్వాసపాత్రమైనవని చాలా కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు.. ఈ విషయం మా కుటుంబానికి సంబంధించిన వారికి బాగా తెలుసు.. అంటూ భావోద్వేగానికి లోనైంది. అలాగే కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఇప్పుడు ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ఈ హాట్ యాంకర్ అనసూయ మరోసారి ఐటెం సాంగ్ లో కనిపించనుందని తెలుస్తోంది. వీరసింహారెడ్డి సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

-Advertisement-

ఆ పాటలో ముందుగా మిల్కీ బ్యూటీని తమన్నాతో చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావించాడు. అయితే తమన్నా కోటిన్నర రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమె స్థానంలో యాంకర్ అనసూయను తీసుకుంటున్నారు మేకర్స్. అనసూయ గతంలో ఒకట్రెండు సినిమాల్లో ఐటం నెంబర్స్ చేసిన సంగతి తెలిసిందే. .

యాంకరింగ్‌కి గుడ్‌బై చెప్పిన అనసూయ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. గురజాడ అప్పారావు రచించిన క్లాసిక్ నాటకం ‘కన్యాశుల్కం’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతున్నట్లు సమాచారం.

ఈ వెబ్ సిరీస్‌లో అనసూయ మధురవాణి అనే వేశ్య పాత్రలో కనిపించనుందని తాజా టాక్. ఇక్కడ విశేషమేమిటంటే సీరియల్ మొత్తం అనసూయ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ వెబ్ సిరీస్‌ని ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు.

మరోవైపు అనసూయ రెమ్యునరేషన్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కామెడీ షో జబర్దస్త్ తో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిన అనసూయ.. తెలుగు యాంకర్లలో సుమ తర్వాతి స్థానంలో ఉంది. అంతేకాదు ఈ భామ దాదాపు రూ. 2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

పుష్ప 2లో అనసూయ పాత్రను పెంచనున్నట్టు తెలుస్తోంది.ఈ భామ ఇప్పటికే కృష్ణ వంశీ రంగ మార్తాండ చిత్రంలో నటించింది. దీంతో పాటు ఆమెకు మంచి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఓ మలయాళ సినిమాలో నటించిన అనసూయకు మరో మలయాళ సినిమాలో అవకాశం వచ్చింది. ఇవి కాకుండా రెండు తమిళ సినిమాల్లో కూడా అనసూయ నటిస్తోంది.

see more :

Anasuya Latest Glamourous photos from USA | అమెరికాలో అనసూయ

Anasuya Latest Super Hot Stills in black dress 17.07.2023

Anasuya Latest Hot Bikini Photos Today 16.06.2023..బికినీ లో హాట్ హాట్ గా..

Anasuya Latest Hot in Bikini 06.06.2023 : చూస్తే మీరు ఫ్రీజ్ అయిపోతారు..

tamanna hot videos | tamanna latest hot photos, stills 2023

Janhvi Kapoor Latest Hot Videos and Hot Photos 2023

Krithi Shetty Latest instagram Photos 2023

 

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News