Anam Ramnarayana Reddy : టీడీపీలో చేరికపై వైసీపీ బహిష్కృత నేత ఆనం రాంనారాయణరెడ్డి కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో నెల్లూరులో లోకేష్ పాదయాత్ర అనంతరం టీడీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే యువగళం యాత్రను విజయవంతం చేస్తామని తెలిపారు. చంద్రబాబుతో భేటీ అయ్యి చేరిక విషయం చెప్పడం సంతోషంగా ఉందన్నారు. మరికొద్ది రోజుల్లో అమరావతి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు తెలిపారు. తాను, తన అనుచరులంతా అదే రోజు పార్టీలో చేరబోతున్నారని ఆనం స్పష్టం చేశారు.
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy) శుక్రవారం రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు గంటపాటు ఈ ఇద్దరు నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. నెల్లూరులో తాజా రాజకీయాలపై చర్చించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అంశంపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. టీడీపీలో చేరిక, రాజకీయ భవిష్యత్తు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం ఆనం టీడీపీలో చేరికపై కీలక ప్రకటన చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు కూడా రానుంది. అయితే పాదయాత్రను విజయవంతం చేసి పార్టీలో చేరతానని ఆనం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ చేశారన్న ఆరోపణలపై వైసీపీ నుంచి ఆనం రాంనారాయణరెడ్డి సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.
read more news :
Apsara Murder Case: అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ ?
MLA Parthasarathy : వైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు 😥
Biparjoy Cyclone : బిపర్‌జాయ్ తుఫాన్🌀.. పలు రాష్ట్రాలకు అలర్ట్🚨