Air pollution in thailand latest news : ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి వాయు కాలుష్యం ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది. గాలి నాణ్యత పడిపోవడం, వాహనాల ద్వారా వెలువడే పొగ, పంట పొలాల కాల్చివేత, అడవులకు నిప్పు పెట్టడం వల్ల వచ్చే పొగ, సీజనల్ వారీగా వచ్చే పొగ మంచు తదితర కారణాల వల్ల చాలా దేశాల్లో వాయు కాలుష్యం పెచ్చుమీరుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. తాజాగా థాయ్‌లాండ్ దేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఏకంగా 13 లక్షల మందికిపైగా అస్వస్థతకు లోనయ్యారు. రెండు లక్షల మంది దాకా ఆస్పత్రులపాలయ్యారు.
also read : Tamanna Latest Photos at Lakme Fashion Week 2023
ఏటా వాయు కాలుష్యానికి గురై లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని అనేక అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో వాయు కాలుష్యం పరిస్థితి చేయిదాటిపోతోంది. ప్రజలు పలు రకాల అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నారు. థాయ్‌లాండ్‌లో దేశ వ్యాప్తంగా గాలిలో నాణ్యత అత్యంత క్షీణించింది. మాస్కులు ధరించి బయటకు వచ్చినా సరే.. కాలుష్య గాలి పీల్చి అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఉద్గార పొగమంచు కప్పేసింది.
also read : Allu Arjun : ప్రభాస్‌ని మించిపోయిన అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్
ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతంగా పేరు గాంచిన బ్యాంకాక్.. ఇలా కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో పర్యాటకులు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా పంట పొలాల్లో వ్యర్థాలను దహనం చేయడం వల్ల బ్యాంకాక్, పరిసర ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రమైందని అక్కడి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బ్యాంకాక్ చుట్టుపక్కల సుమారు 50 జిల్లాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.
also read : Beetroot juice : రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే అందం మరింత పెరగడం తథ్యం!
ఇక ఈ 50 జిల్లాల్లో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారిందని, 2.5 పీఎం స్థాయికి క్షీణించిపోయిందని తెలుస్తోంది. ఈ పరిస్థితి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న గాలి కాలుష్య స్థాయిని కూడా మించిపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ గాలిని పీల్చడం వల్ల శరీరంలోకి పోయి రక్తంలో కలిసిపోతోంది. దీంతో అవయవాలు దెబ్బతిని ఆరోగ్యం క్రమంగా నశించిపోతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా థాయ్‌లాండ్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది. వాయు కాలుష్యం కారణంగా ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 1.3 మిలియన్లకు పైగా ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులు, గర్భిణులు బయటకు రావొద్దంటూ ప్రభుత్వం సూచించింది. అత్యంత నాణ్యత కలిగిన ఎన్95 మాస్కులను ధరించాలని పేర్కొంది.