అబుదాబి నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం కారణంగా మంటలు రావడం కలకలం రేపింది. అయితే, పైలెట్ అప్రమత్తమై చర్యలు తీసుకోవడం ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగా ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. శుక్రవారం ఉదయం అబుదాబి నుంచి కాలికట్‌కు ఎయిర్ ఇండియా విమానం బల్దేరింది. ఇక టేకాఫ్ అయిన తర్వాత వెయ్యి అడుగుల ఎత్తులో విమానం ఉంది.
అనంతరం ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడి మంటలు చెలరేగాయి. దీంతో పైలెట్ గమనించి విమానాన్ని తిరిగి అబుదాబి ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. ఈ విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులంతా సురక్షితమని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.
ఎయిర్ ఇండియా విమానం B737-800 టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం ఏర్పడిందని, వెంటనే పైలెట్ తిరిగి సేఫ్‌గా ల్యాండ్ చేశారని తెలిపింది. ఇంజిన్‌లో మంటలు వ్యాప్తి చెందడానికి కారణాలు తెలియడం లేదని, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జనవరి 23న తిరువనంతపురం నుంచి మస్కట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యలతో టేకాఫ్ అయిన కాసేపటికే మళ్లీ తిరువనంతపురంలో ల్యాండ్ అయింది.
also read :
China spy balloon : అమెరికాలో చైనా నిఘా బెలూన్.. కూల్చివేయబోయి ఆగిపోయిన యూఎస్ ఇంటెలిజెన్స్!
మృణాల్ ఠాకూర్ ఫోటోలు.. ఇంతందం దారి మళ్లిందా..