తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ పబ్లిక్ కమిషన్ ద్వారా దాదాపు 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం (నవంబర్ 25) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్-4 ఉద్యోగాల్లో ప్రధానంగా నాలుగు కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉంటాయి.
- మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 6,859 ఉన్నాయి.
- ఉన్నత విద్యాశాఖలో 742,
- బీసీ సంక్షేమంలో 307,
- హోంశాఖలో 133,
- పంచాయతీరాజ్‌లో 1245,
- రెవెన్యూ శాఖలో 2,077 పోస్టులు ఉన్నాయి.
ఈ విషయమై మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. త్వరలో గ్రూప్-4 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులన్నీ రాత పరీక్ష ద్వారా భర్తీ చేయబడతాయి. ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించిన నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
- జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, (పంచాయతీ రాజ్ శాఖలో 1,245 పోస్టులు, రెవెన్యూ విభాగంలో 2,077 పోస్టులు)
- junior ఆడిటర్ పోస్టులు 18
- వార్డ్ ఆఫీసర్ పోస్టులు 1,862.
Big announcement!
9,168 Group-IV vacancies be filled by Direct Recruitment through TSPSC#Telangana Govt under #CMKCR Garu, the leader who is serving & fulfilling the promises & wishes, accorded Permission for filling-up of such huge number of posts.
Best wishes to aspirants. pic.twitter.com/4YBgHRAp0q— Harish Rao Thanneeru (@trsharish) November 25, 2022