sunflower seeds benefits : మధ్యాహ్న భోజనం తర్వాత చాలామందికి సాయంత్రం వేళ ఆకలి వేస్తుంది. దీని వల్ల చాలా మంది బయట దొరికే జంక్ ఫుడ్ తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
అయితే అవి కాకుండా పొద్దు తిరుగుడు గింజలను(sun flower seeds) సాయంత్రం పూట చిరుతిళ్ల రూపంలో తీసుకుంటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పొద్దు తిరుగుడు గింజలను రోజూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తనాళాల్లోని కొవ్వు కరిగిపోతుంది.
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
పొద్దు తిరుగుడు గింజలను రోజూ తింటే జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది.
సన్ ఫ్లవర్ సీడ్స్ లో క్యాన్సర్‌ను నివారించే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే ఎముకలు దృఢంగా మారుతాయి.
పొద్దు తిరుగుడు గింజలు తింటే మానసిక సమస్యలు దూరమవుతాయి. శరీరంలో వాపు తగ్గుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది.
హైబీపీ అదుపులో ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం మరియు జుట్టు సంరక్షణ కలుగుతుంది.
also read :
Mutton Canteen : నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 12 న తెలంగాణ మటన్ క్యాంటీన్ ప్రారంభం
sudigali sudheer : నా విజయం వెనుక రష్మీ ఉంది..
Bandi Sanjay : బండి సంజయ్‌పై తెలంగాణ హైకోర్టు అసహనం.. రూ.50వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం