Homecinemasudigali sudheer : నా విజయం వెనుక రష్మీ ఉంది..

sudigali sudheer : నా విజయం వెనుక రష్మీ ఉంది..

Telugu Flash News

sudigali sudheer : టీవీ షో జబర్దస్త్‌లో కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్.. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు, త్రీ మంకీస్ సినిమాల్లో నటించాడు. ఇక రష్మీతో కెమిస్ట్రీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ నిజంగా ప్రేమికులా కాదో తెలియదు కానీ.. ఈ ఇద్దరు తెరపై కనిపిస్తే మాత్రం ప్రేక్షకులకు మాత్రం నచ్చుతుంది. ఇటీవల సుధీర్-రష్మీ ఓ ప్రముఖ ఛానెల్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ పాత వీడియోలు చూపించడం తో ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు.

“రష్మీతో నేను అందమైన ప్రయాణం చేశాను. బేసిక్ గా తను కష్టపడే మనస్తత్వం ఉన్న అమ్మాయి. అందరికంటే రష్మినే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నా విజయానికి ఆమే ప్రధాన కారణం..” అని సుధీర్ కాస్త ఎమోషనల్ గా చెప్పాడు. నిజానికి ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను సుధీర్ సక్సెస్ కి కారణం.. ముగ్గురూ కలిసి చేసిన స్కిట్స్ ప్రతిసారీ హైలెట్ అయ్యాయి.. స్నేహితులకు వెన్నుపోటు పొడిచాడని నెటిజన్లు అంటున్నారు.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News